Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే.. ఎలా ఉన్నాయంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 11, 2022, 09:29 AM IST
Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లివే.. ఎలా ఉన్నాయంటే..?

సారాంశం

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. WTI క్రూడ్ 89.62 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 90.96 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి నుండి సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఫిబ్రవరి 11, 2022) స్థిరంగా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ధరలను యథాస్థితిలో కొనసాగిస్తున్నాయి. అయితే నేడు కొన్ని నగరాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశముంది.

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.50, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.24, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.29, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.56

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 102.10, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.


అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. WTI క్రూడ్ 89.62 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 90.96 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి నుండి సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పైపైకి చేరుకున్నాయి. అయితే క్రితం సెషన్‌లో ధరలు తగ్గాయి. అయితే ఉద్రిక్తతల కారణంగా ధరలు పెరిగాయి. 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.

PREV
click me!

Recommended Stories

Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం