ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గ్యారేజీలో మరో కొత్త కారు వచ్చి చేరింది. రతన్ టాటా కోసం ప్రత్యేకంగా నానో ఈవీ వెర్షన్ కారుని తయారు చేసింది టాటా ఎలక్ట్రా సంస్థ.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గ్యారేజీలో మరో కొత్త కారు వచ్చి చేరింది. రతన్ టాటా కోసం ప్రత్యేకంగా నానో ఈవీ వెర్షన్ కారుని తయారు చేసింది టాటా ఎలక్ట్రా సంస్థ. రతన్ టాటా కోరిక మేరకు ఆయన అవసరాలకు తగ్గట్టుగా ఇటీవల కస్టమైజ్డ్ ఈవీ నానో కారును డెలివరీ చేసింది. రతన్‌టాటా అతని సహాయకుడు శంతను నాయుడు ఈ కారులో ప్రయాణించారు.
విద్యుత్తు వాహనాల సంస్థ ఎలక్ట్రా ఈవీ అభివృద్ధి చేసిన సరికొత్త 72వీ నానో విద్యుత్తు కారు రతన్ టాటాకు చేరింది. ఈ విషయాన్ని ఎలక్ట్రా ఈవీ లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించింది. టాటాకు కారు డెలివరీ చేసినందుకు గర్వంగా ఉందని, ఆయన నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నామని తెలిపింది.
undefined
ఎలక్ట్రా ఈవీకి ఇవి ఆనంద క్షణాలు. మా వ్యవస్థాపకుడు రతన్ టాటా సరికొత్త 72వీ నానో విద్యుత్ కారులో ప్రయాణించారు. టాటాకు నానో ఈవీ డెలివరీ చేయడం, ఆయన నుంచి అమూల్యమైన ఫీడ్ బ్యాక్ తీసుకోవడం అత్యంత గౌరవంగా భావిస్తున్నాంమని ఎలక్ట్రా ఈవీ పోస్ట్‌లో రాసుకొచ్చింది. నానో ఈవీ పక్కన టాటా తన అసిస్టెంట్ శంతను నాయుడితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది.
రతన్ టాటా కోసం తయారు చేసిన నానో 72 వీ ఎలక్ట్రిక్ కారు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రమాణాల ప్రకారం సింగిల్ ఛార్జ్‌తో 213 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా గ్రౌండ్ రియాలిటీలో కనీసం 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పది సెకన్ల వ్యవధిలో గంటలకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగం అందుకోగలదు. ఇందులో లిథియం ఐయాన్ బ్యాటరీ ఉపయోగించారు. టాటా నానో ఈవీ కారు ఫోర్ సీటర్. పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత రవాణాను అందించడమే ధ్యేయంగా ఈ కారును ఆవిష్కరించినట్లు గతంలో టాటా మోటార్స్ తెలిపింది.
సామాన్యులకు కారు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నానో కారుని తెచ్చారు రతన్‌టాటా. కేవలం లక్ష రూపాయల బడ్జెట్‌తో తెచ్చిన ఈ కారు మార్కెట్‌లో అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా.. మధ్యతరగతి ప్రజలకు కారును చేరువ చేసింది. టాటా గ్రూపు నుంచి లగ్జరీ కార్లతో పాటు నెక్సాన్, టిగోర్ వంటి ఈవీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రతన్‌టాటా నానోను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.