Petrol Diesel Prices Today: గుడ్ న్యూస్‌.. నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 30, 2022, 09:42 AM IST
Petrol Diesel Prices Today:  గుడ్ న్యూస్‌.. నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే..!

సారాంశం

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOCL) చమురు ధరలకు సంబంధించి ఆదివారం (జనవరి 30, 2022) ధరలను విడుదల చేశాయి.

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOCL) చమురు ధరలకు సంబంధించి ఆదివారం (జనవరి 30, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అయితే ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ధ‌ర‌లు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఒపెక్ దేశాలు ఫిబ్రవరి 2న కీలక సమావేశం నిర్వహించబోతున్నాయి. ఇందులో తీసుకునే నిర్ణయాలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసే అవకాశముంది. అంటే వచ్చే నెలలో వీటి ధరలు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచకపోవచ్చని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. కాగా భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్