సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు.. ఒకనెలలోనే ఎనిమిదిసార్లు పెంపు..

By S Ashok KumarFirst Published May 14, 2021, 11:23 AM IST
Highlights

చమురు కంపెనీలు ఒక రోజు విరామం తీసుకుని నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. 

నేడు  ప్రభుత్వ చమురు కంపెనీలు ఒక రోజు విరామం తరువాత పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మళ్ళీ పెంచాయి. దీంతో పెట్రోల్ పై 28-29 పైసలు పెరగగా, డీజిల్‌పై దేశవ్యాప్తంగా 34-35 పైసలు పెరిగింది. దేశంలో ఇంధన ధరలను ఒక  నెలలో ఎనిమిదోసారి పెంచారు.

తాజా పెంపుతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ముంబైలో  లీటరు పెట్రోల్‌ ధర రూ .98.65 కు విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో రూ .92.44, చెన్నైలో రూ .94.09 వద్ద లభిస్తుంది. నోయిడాలో పెట్రోల్ రిటైల్ ధర రూ .90.27.

గత కొన్ని రోజులలో డీజిల్ ధర కూడా బాగా పెరిగింది. ముంబైలో లీటరు డీజిల్‌ ధర రూ.90.11. ఢీల్లీలో లో రూ .82.95. కోల్‌కతాలో రూ .85.79, చెన్నైలో రూ .87.81. నోయిడాలో ఒక లీటరు డీజిల్ ధర రూ .83.41. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 30 పైసలు పెరిగి రూ.95.97కు చేరుకుంటే, డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.90.43‌ చేరుకుంది.

also read కరోనా వ్యాప్తి నివారణకై అమెజాన్, టాటా, రిలయన్స్ ముందడుగు.. రోగులకు అండగా వైద్య సహాయం.. ...

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వివిధ రాష్ట్రాలు  ఆంక్షలతో కూడిన లాక్ డౌన్  విధించడంతో భారతదేశం అంతటా ఇంధన డిమాండ్ తగ్గిపోయింది. గత 10 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు 1.79 రూపాయలు, డీజిల్‌  లీటరుకు 2.04 రూపాయలు పెంచింది.

భారతదేశంలో ఇంధన ధర అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి డాలర్ మార్పిడి రేటుపై ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్) - కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు వివిధ పన్నులు విధిస్తాయి.

పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60%, డీజిల్ పై 54% కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉన్నాయి. డీలర్  కమీషన్, సరుకు రవాణా ఛార్జీలు కూడా ఇంధన ధరలో చేర్చబడతాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ ఇంధన  ధరలను సమీక్షిస్తాయి.

click me!