మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...

By Sandra Ashok Kumar  |  First Published Mar 9, 2020, 1:12 PM IST

పెట్రోల్ ధర లీటరుకు 24-27 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 25-26 తగ్గించింది.ధర తగ్గింపు తర్వాత పెట్రోల్ ఇప్పుడు ఢిల్లీలో లీటరుకు రూ .70.59, ముంబైలో రూ .76.29, కోల్‌కతాలో రూ .73.28, చెన్నైలో రూ .73.33 ఉంది.


న్యూ ఢిల్లీ: కరోనావైరస్  ప్రపంచవ్యాప్తంగా మరింతగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ముడి చమురు ధర తగ్గి ఇంధన ధరలు మరింతగా పడిపోయాయి.పెట్రోల్ ధర లీటరుకు 24-27 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 25-26 తగ్గించింది.

also read రాణా కపూర్ కూతురుకి షాక్... విమానం ఎక్కుతున్న ఆమెను...

Latest Videos

undefined

ధర తగ్గింపు తర్వాత పెట్రోల్ ఇప్పుడు ఢిల్లీలో లీటరుకు రూ .70.59, ముంబైలో రూ .76.29, కోల్‌కతాలో రూ .73.28, చెన్నైలో రూ .73.33 ఉంది. అదేవిధంగా డీజిల్ ధర ఢిల్లీలో రూ .63.26, ముంబైలో రూ .66.24, కోల్‌కతాలో రూ .65.59, చెన్నైలో 66.75 రూపాయలు అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ తెలిపింది

అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆదివారం రాత్రి అత్యధికంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ భయం కారణంగా డిమాండ్ తగ్గటం  వలన ఈ పతనం ప్రారంభమైంది.బెంచ్మార్క్ బ్రెంట్ 29 శాతానికి పైగా తగ్గి బ్యారెల్కు 32.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, దాదాపు బ్యారెల్కు 13.22 డాలర్లు తగ్గింది. 1991లో గల్ఫ్ జరిగిన యుద్ధం తరువాత ధరలు పతనం కావడం ఏదే తొలిసారి.  

also read డజన్ల కొద్ది కంపెనీలు... వేల కోట్ల పెట్టుబడులు...ఇది రాణా కపూర్ స్టైల్...

ఇంధన రిటైల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు రూపాయి-యుఎస్ డాలర్ మార్పిడి రేటుపై ఆధారపడి ఉంటాయి, ఎందుకంటే భారతదేశం ముడి చమురు అవసరాలలో దాదాపు 80 శాతం దిగుమతి చేస్తుంది.పెట్రోల్ డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ సమీక్షిస్తాయి. ఉదయం 6 గంటలకు ఇంధన స్టేషన్లలో ధరల సవరణలు అమలు చేస్తారు.

click me!