Petrol Diesel Price today:వాహనదారులకు రిలీఫ్.. పండగ సీజన్లో ఇంధన ధరల పెంపుకు బ్రేక్.. కొత్త ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Jan 12, 2022, 11:53 AM IST
Highlights

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు  ఒక నెలకు పైగా ఎలాంటి  మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగిన రిటైల్ ఇంధన ధరలపై వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం నవంబర్ 3న పెట్రోల్‌పై లీటరుకు రూ. 5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. 

నేడు ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో  ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గత 41 రోజుల నుండి ఇంధన  ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోలు ధర ఇప్పటికి రూ.100 పైనే కొనసాగుతోంది. అంతేకాకుండా దేశంలో చమురు ధరలు ఇప్పటికీ వాహనదారులను అలాగే సామాన్యుల ఆదాయంపై ప్రభావం చూపుతోంది.

గత నెల డిసెంబరులో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై మాత్రమే విలువ ఆధారిత పన్ను (VAT)ను 30 శాతం నుంచి 19.40 శాతం తగ్గించింది. ఈ సవరణ కారణంగా దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.8.56 తగ్గింది. ఢిల్లీలో జనవరి 12న ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67గా ఉంది. 

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79.  చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.101.42, డీజిల్ రూ.91.44గా ఉంది.

వ్యాట్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇంధన ధరలు మారుతాయని గమనించాలి. భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వంటి ప్రభుత్వరంగ  చమురు కంపెనీలు అంతర్జాతీయ ధర, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్-డీజిల్ ధరలలో ఏదైనా సవరణ  ఉంటే ప్రతిరోజు 06:00 AM IST నుండి అమలు చేయబడుతుంది.

గ్లోబల్ మార్కెట్లలో బెంచ్మార్క్ చమురు ధరలు బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో పెరిగాయి, యూ‌ఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసిన దానికంటే క్రమంగా రేట్లు పెంచవచ్చని సూచించిన తర్వాత గత సెషన్‌లో లాభాలను పొడిగించాయి, అని ఒక నివేదిక నివేదించింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ అండ్ యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ రెండూ నవంబర్ 2021 నుండి అత్యధిక స్థాయిలో ట్రేడవుతున్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 22 సెంట్లు లేదా 0.3 శాతం ఆర్జించాయి, అంటే గత సెషన్ నుండి 3.5 శాతం పెరిగి బ్యారెల్‌కి 83.94డాలర్లకి చేరుకుంది. అదేవిధంగా WTI ఫ్యూచర్స్ 0224 GMTకి 38 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి బ్యారెల్ 81.60డాలర్లకి చేరుకుంది, అంటే గత సెషన్‌తో పోలిస్తే 3.8 శాతం పెరిగింది.

 భారతదేశంలోని  ప్రముఖ నగరాలలో జనవరి 12న పెట్రోల్, డీజిల్ ధరలు

ముంబైలో పెట్రోల్ ధర - లీటరుకు రూ.109.98, డీజిల్ ధర - లీటరుకు రూ.94.14

ఢిల్లీలో పెట్రోల్ ధర- లీటరుకు రూ. 95.41, డీజిల్ ధర - లీటరుకు రూ.86.67

చెన్నైలో పెట్రోల్ ధర- లీటరుకు రూ. 101.40, డీజిల్ ధర- లీటరుకు రూ. 91.43

కోల్‌కతాలో పెట్రోల్ ధర - లీటరుకు రూ.104.67, డీజిల్ ధర- లీటరుకు రూ. 89.79

త్రివేండ్రంలో పెట్రోల్ ధర - లీటరుకు రూ. 106.04, డీజిల్ ధర - లీటరుకు రూ. 93.17

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర - లీటరుకు రూ.108.20, డీజిల్ ధర - లీటరుకు రూ.94.62

బెంగళూరులో పెట్రోల్ ధర - లీటరుకు రూ. 100.58, డీజిల్ ధర - లీటరుకు రూ. 85.01

జైపూర్‌లో పెట్రోల్ ధర - లీటరుకు రూ.106.64, డీజిల్ ధర - లీటరుకు రూ. 90.32

లక్నోలో పెట్రోల్ ధర - లీటరుకు రూ. 95.28, డీజిల్ ధర - లీటరుకు రూ. 86.80

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర - లీటరుకు రూ.101.81, డీజిల్ ధర - లీటరుకు రూ.91.62

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను  ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు  ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతుంటాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. 

click me!