బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గిన వెండి.. కొనే ముందు తాజా ధరలు తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Jan 12, 2022, 11:00 AM IST
Highlights

నేడు స్థిరమైన గ్లోబల్ రేట్ల మధ్య భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు రెండు నెలల కనిష్ట స్థాయికి దగ్గరయ్యాయి. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.11% తగ్గి 10 గ్రాములకు  రూ.47,637కి చేరుకోగా, వెండి 0.15% తగ్గి కిలోకు రూ.61,018కి చేరుకుంది.

నేడు ఎం‌సి‌ఎక్స్ లో బంగారం తలుకులు బుధవారం బలహీనపడింది, మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. మీరు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు మంచి అవకాశం. దీనికి ముందు బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నేడు బంగారం ధర 0.11 శాతం తగ్గింది. ఈ పతనంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,635కి తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా పతనమైంది. కిలో వెండి ధర 0.15 శాతం తగ్గి రూ.61,014కు చేరుకుంది. 

ఎక్కువగా 22 క్యారెట్లు మాత్రమే నగల తయారీకి ఉపయోగిస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఆభరణాలపై క్యారెట్‌ను బట్టి హాల్‌ మార్క్‌ను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది.

 ఫెడ్ చైర్ లెస్ హాకిష్ వ్యాఖ్యల తర్వాత ట్రేడర్లు ధరల సూచనల కోసం యుఎస్ ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి సారించడంతో బంగారం ధరలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడుతూ, అధిక ద్రవ్యోల్బణం కాకుండా ఇంకా ఉద్యోగ వృద్ధిని తగ్గించకుండా అధిక పాలసీ వడ్డీ రేట్ల వైపు మళ్లేలా చూడాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించిందని అన్నారు.

అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాల కంటే ముందు బంగారం ధరలు అస్థిరంగానే ఉంటాయని షేర్‌ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ రీసెర్చ్ హెడ్ రవి సింగ్ అంచనా వేస్తున్నారు. “ముందస్తు రేట్ల పెంపు అంచనా బంగారం ర్యాలీకి చెక్ పెట్టవచ్చు,” అని అన్నారాయన. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం మంగళవారం స్పాట్ మార్కెట్‌లో అత్యధిక స్వచ్ఛతగల బంగారం 10 గ్రాములకు రూ.47,705గా ఉండగా, వెండి కిలో ధర రూ.60,440గా ఉంది.

గత రెండు రోజుల్లో వెండి వెంటనే రికవరీ అయితే, బంగారం స్పాట్ ధరలు వారం కంటే ఎక్కువ కాలంగా రూ.48,000 లోపే ఉన్నాయి. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కి 0.1 శాతం తగ్గి 22.73 డాలర్లకి, ప్లాటినం 0.4 శాతం తగ్గి 967.43 డాలర్లకి, పల్లాడియం 1,920.67  డాలర్ల వద్ద స్థిరపడింది.

మీ నగరంలో బంగారం, వెండి ధరలను ఇలా తెలుసుకోండి
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి. మీరు మీ నగరంలో బంగారం ధరలను మొబైల్‌లో కూడా చెక్ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు. 

దేశంలోని వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు 

చెన్నైలో బంగారం ధర: రూ.44,870
ముంబైలో బంగారం ధర: రూ.46,590
ఢిల్లీలో బంగారం ధర: రూ.46,650
కోల్‌కతాలో బంగారం ధర: రూ.46,850
బెంగళూరులో బంగారం ధర: రూ.44,700
హైదరాబాద్‌లో బంగారం ధర: రూ.44,700
కేరళలో బంగారం ధర: రూ.44,700
పూణేలో బంగారం ధర: రూ.45,840
 

click me!