నేడు స్థిరంగా బంగారం, వెండి.. మీ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Jan 11, 2022, 11:20 AM IST
నేడు స్థిరంగా బంగారం, వెండి.. మీ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకోండి..

సారాంశం

నేడు మంగళవారం జనవరి 11న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక అంశాలు కారణాలుగా చెప్పవచ్చు.  

భారతదేశంలో బంగారం ధరలు నేడు కాస్త అధికంగా ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లలో జనవరి 11న బంగారం ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 60 పెరిగి రూ.47,515 వద్ద ట్రేడవుతోంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కిలోకు రూ. 60,791 వద్ద ఉంది, ఎం‌సి‌ఎక్స్ లో రూ. 124 పెరిగింది.

ఒక నివేదిక ప్రకారం ఈ వారం చివర్లో వచ్చే డిసెంబర్ యూ‌ఎస్ ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా మార్కెట్లు  ధరల పెంపును అంచనా వేయడంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి, అయితే బలమైన బాండ్ ఈల్డ్స్ లాభాలను పెంచాయి. స్పాట్ బంగారం ఔన్సుకు 1,803.29 డాలర్ల వద్ద కొద్దిగా మారగా, యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 1,802.20 డాలర్లకి చేరుకున్నాయి.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం సోమవారం స్పాట్ మార్కెట్‌లో అత్యధిక స్వచ్ఛతగల బంగారం 10 గ్రాములు ధర రూ.47,627గా ఉండగా, వెండి కిలో ధర రూ.60,351గా ఉంది.బంగారం ధర దాదాపు ఒక వారం పాటు రూ. 48,000 లోపే ఉంది, అయితే వెండి గత సెషన్‌లో రూ. 60,000 స్థాయిని అధిగమించిన తర్వాత త్వరగా కోలుకుంది.

గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ బంగారం 0232GMT నాటికి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,806.00డాలర్లకి చేరుకుంది. యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,804.90 డాలర్ల వద్ద ఉన్నాయి. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 22.55 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 1 శాతం పెరిగి 949.28 డాలర్లకు, పల్లాడియం 0.5 శాతం పెరిగి 1,921.74 డాలర్లకు చేరుకుంది.

బంగారం ధరలకు వ్యతిరేకంగా కదులుతున్న డాలర్ నిన్న 0.3 శాతం లాభపడింది. డాలర్‌ను బలపరిచేందుకు లిబియా చమురు ఉత్పత్తి తిరిగి పుంజుకోవడంతో ముడి చమురు ధరలను తగ్గించడం విలువైన లోహాలపై ఒత్తిడి తెచ్చింది. యూ‌ఎస్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 1.8 శాతానికి పెరిగింది, ఒక విధంగా ఇది పెట్టుబడిదారులను డాలర్ ఇండెక్స్‌లో ఉంచడానికి ఆకర్షిస్తోంది. ధరలు రెసిస్టెన్స్ లెవల్స్ వైపు పెరిగితే విలువైన లోహాలలో అమ్మకాల ఒత్తిడి ఉంటుందని అంచనా. గోల్డ్ రెసిస్టన్స్ రూ. 47700, సపోర్ట్ రూ. 47250. సిల్వర్ రెసిస్టన్స్ రూ. 61000 వద్ద, సపోర్ట్ రూ. 60000 వద్ద ఉందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ కమోడిటీ & కరెన్సీ హెడ్ అభిషేక్ చౌహాన్ తెలిపారు.

భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి అమ్మకపు ధరతో పోల్చితే నేడు ధరలలో పెద్దగా ఎటువంటి మార్పు లేకపోవడంతో జనవరి 11న రూ. 48,610 వద్ద ఉంది. మరోవైపు వెండి కిలో ధర రూ.60,700 నుంచి రూ.300 తగ్గడంతో కిలో రూ.60,400కి కొనుగోలు చేస్తున్నారు.

దేశంలో ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీలు వంటి అంశాల కారణంగా ఎక్కువ డిమాండ్ ఉన్న లోహం ధర ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,610, న్యూఢిల్లీలో రూ.46,760కి కొనుగోలు చేయబడుతోంది . చెన్నైలో  రూ.44,720, కోల్‌కతాలో రూ.46,860గా ట్రేడవుతోంది.

24 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే ఆర్థిక రాజధాని ముంబైలో ఈ రోజు 10 గ్రాముల విలువైన లోహం ధర రూ. 48,610, దేశ రాజధానిలో ఢిల్లీలో రూ. 51,010 వద్ద అమ్ముడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం అమ్మకపు ధర రూ.49,560, కోల్‌కతాలో రూ.49,010గా ఉంది. హైదరాబాద్, బెంగళూరులలో లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 48,550, 22-క్యారెట్ల స్వచ్ఛతగల ధర రూ. 44,500 వద్ద కొనుగోలు చేయబడింది.  

PREV
click me!

Recommended Stories

Cheapest EV bike: చవక ధరకే ఏథర్ ఈవీ బైక్.. ఇలా అయితే ఓలాకు కష్టమే
Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి