నేటికీ ఏడాదిగా స్థిరంగా పెట్రోలు-డీజిల్ ధరలు.. ఈ రోజు లీటరు ధర ఎంతో తెలుసుకోండి..?

By asianet news teluguFirst Published May 21, 2023, 9:12 AM IST
Highlights

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలో నేటికీ ఎలాంటి మార్పు లేదు. WTI క్రూడ్ బ్యారెల్‌కు $71.55 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $75.58 డాలర్లకు చేరింది. భారతదేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు వీటి ధరలలో సవరణ ప్రతి 15 రోజులకు ఉండేది.
 

 నేడు 21 మే 2023 రోజున ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి  శుభవార్త, ఈ రోజు మరోసారి సామాన్యులకు ఉపశమనం లభించింది. భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు  తాజాగా  పెట్రోల్,  డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఇందులో నేటికీ మార్పు లేదు. అయితే ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేకుండా ఈ రోజుకి వరుసగా 365వ రోజు.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలో నేటికీ ఎలాంటి మార్పు లేదు. WTI క్రూడ్ బ్యారెల్‌కు $71.55 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $75.58 డాలర్లకు చేరింది. భారతదేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు వీటి ధరలలో సవరణ ప్రతి 15 రోజులకు ఉండేది.

రాజస్థాన్‌లో పెట్రోలు ధర 90 పైసలు, డీజిల్ ధర 81 పైసలు పెరిగింది. మహారాష్ట్రలో కూడా పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు అధికంగా మారింది. పంజాబ్‌లో పెట్రోల్ ధర 45 పైసలు, డీజిల్ 43 పైసలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధర 41 పైసలు పెరిగింది. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళలో కూడా ఇంధనం ధర పెరిగింది. మరోవైపు గుజరాత్‌లో పెట్రోల్-డీజిల్ ధర 27 పైసలు తగ్గింది. మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 24 పైసలు తగ్గాయి.  

 మే 21న ఎక్సైజ్ సుంకం 
గత సంవత్సరం ప్రారంభంలో మే 21, 2022 న పెట్రోల్ డీజిల్ ధరపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దింతో లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున  తగ్గింది. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.

నేడు పెట్రోల్-డీజిల్ ధరలు

ఢిల్లీ-  లీటరు పెట్రోలు ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62

ముంబై- లీటర్  పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27

కోల్‌కతా -  లీటరు పెట్రోలు ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

చెన్నై - లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24

హైదరాబాద్:  లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు :  లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం:  లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్:  లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్:  లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్:  లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో:  లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా:  లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్:  లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా:  లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్ : లీటర్ పెట్రోల్ ధర  రూ. 97.18, డీజిల్ ధర  రూ. 90.05 లీటరుకి.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్,  డీజిల్ ధరలను సమీక్షించి, కొత్త రేట్లు జారీ చేయబడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ ధర  ఇంత అధికంగా  ఉండటానికి  ఇదే కారణం.

click me!