సెప్టెంబర్ 30 తర్వాత మార్కెట్లోకి రూ.3000 నోటు రాబోతోందా..? సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ ఆర్థిక వేత్త..

By Krishna AdithyaFirst Published May 21, 2023, 12:44 AM IST
Highlights

ప్రస్తుతం మార్కెట్ నుంచి 2000 రూపాయలు ఓట్లను ఆర్బిఐ ఉపసంహరించనున్నట్లు ప్రకటించింది.  అయితే సెప్టెంబర్ 30లోగా  నోట్లను మార్పిడి చేసుకోవాలని ఆర్బీఐకి ఇప్పటికే తెలిపింది.  బాగా సెప్టెంబర్ 30 అనంతరం ఆర్బిఐ 3000 రూపాయల నోటును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త షైజుమోన్ అంచనా వేశారు.  అందుకు గల కారణాలను సైతం ఆయన విపులీకరించారు. 

రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను నిషేధించడంతో రూ.1000 కరెన్సీ తిరిగి వచ్చే అవకాశం ఉందని కేరళకు చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సీ షైజుమోన్ తెలిపారు. రూ.2000 నోటు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత ప్రస్తుత కరెన్సీలలో అతిపెద్ద కరెన్సీ రూ.500 అవుతుంది. అయితే, అప్పటికి పెద్ద కరెన్సీ మార్కెట్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడారు.

‘‘వస్తువుల ధరలు పెరిగినప్పుడు  ప్రజల సౌకర్యార్థం దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ ఉండాలి. 1960లలోనే  దేశంలో 10,000, 5,000 విలువైన కరెన్సీలు ఉన్నాయి. తర్వాత అది గరిష్టంగా 1000 ఆపై 2000కి చేరుకుంది. అయితే ప్రస్తుతం ప్రధాన ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌గా మారాయి. కానీ  ఇప్పుటికీ ప్రజలకు చాలా లావాదేవీల్లో కరెన్సీ నోట్లు కావాలి. ఈ నేపథ్యంలో బహుశా వెయ్యి నోటు తిరిగి వస్తుందా,  లేదంటే రూ. 3000 లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ వచ్చే అవకాశం ఉందని  షైజుమోన్ అన్నారు.

గత రెండు వారాల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ,  కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతోందని అన్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ డబ్బును వినియోగించాల్సి ఉంటుంది. అందుకే డిమాండుకు అనుగుణంగా  డబ్బును వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో  రూ. 1000 నోటు తిరిగి వచ్చే అవకాశం ఉందని లేదా 3000 ప్రవేశపెట్టే అవకాశం ఉందని నేను అర్థం చేసుకున్నాను," అని షైజుమోన్ అంచనా వేశారు. 

రూ.2000 నోటును నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. మే 23 నుంచి విడతల వారీగా రూ. 20,000  చొప్పున బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. నోట్ల మార్పిడికి గడువు సెప్టెంబర్ 30. ప్రస్తుతం భారత మార్కెట్‌లో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు 181 కోట్లు మాత్రమే ఉన్నాయి. 

గతంలో 2016లో నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోట్లను విడుదల చేశారు. 2017 తర్వాత దేశంలో ఈ నోటు ముద్రించలేదు. తర్వాత డీమోనిటైజేషన్‌ను దశలవారీగా రద్దు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2000 నోట్ల రద్దు ప్రభావం 2016 నోట్ల బ్యాన్ పరిస్థితి అంతగా ఉండదని అంచనా. మార్కెట్‌లో రూ.2000 నోట్లు తక్కువగా అందుబాటులో ఉండడమే ఇందుకు కారణం. 

 

click me!