కనిష్ట స్థాయిలో క్రూడాయిల్.. నేడు హైదరాబాద్ లో లీటరు పెట్రోల్-డీజిల్ ధర ఎంతో తెలుసా..?

By asianet news teluguFirst Published Dec 7, 2022, 9:42 AM IST
Highlights

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 

నేడు ఇంధన  ధరలు అంటే 7 డిసెంబర్ 2022న స్థిరంగా ఉన్నాయి. దాదాపు ఆరు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి  మార్పు లేదు. ఈ ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీంతో ఇంధన ధరలు భారీగా దిగ్గోచ్చాయి.  

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతి రోజు ధరలను సమీక్షించి సవరిస్తాయి.

 
నగరం       పెట్రోల్      డీజిల్ 
న్యూఢిల్లీ    96.72         89.62
ముంబై      106.31      94.27
కోల్‌కతా    106.03       92.76
చెన్నై       102.63       94.24
నోయిడా    96.79        89.96
లక్నో        96.57         89.76
జైపూర్      108.48       93.72
పాట్నా     107.24        94.04
భోపాల్    108.65        93.90
చండీగఢ్  96.20        84.26
రాంచీ     99.84          94.65
భోపాల్    108.65        93.90
గాంధీనగర్    96.63    92.38
బెంగళూరు   101.94   87.89
గురుగ్రామ్    97.18     90.05

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర  రూ.97.82.

ముడిచమురు ధర మంగళవారం భారీ పతనమై ఈ ఏడాది కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర ఈ ఏడాది రెండోసారి బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువకు పడిపోయింది.

రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒక దశలో క్రూడాయిల్ బ్యారెల్ కు  $139డాలర్లకి చేరుకుంది,  2008 నుండి అత్యధిక స్థాయి. అయితే దేశంలో నేటికీ పెట్రోల్‌-డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర నేడు తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85 డాలర్లకి పడిపోయింది.

click me!