బిజినెస్ ఐడియా: చదువు లేకపోయినా ఉన్న ఊరిలోనే, సొంతకాళ్లపై నిలబడి చేసుకునే వ్యాాపారం ఇదే, నెలకు లక్షల్లో ఆదాయం

By Krishna AdithyaFirst Published Dec 7, 2022, 9:19 AM IST
Highlights

ఉద్యోగం కోసం చూసి విసిగిపోయారా, అయితే మీకు ఒక చక్కటి వ్యాపార మార్గం గురించి చెప్పబోతున్నాము. ఈ వ్యాపారానికి మీకు ఎలాంటి చదువుతోనూ సంబంధం లేదు,. ఏ కంపెనీలోనూ ఏ యజమాని దగ్గర కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

వ్యాపారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా అయితే పెట్టుబడి ఎలాగా అని ఆలోచిస్తున్నారా పెట్టుబడి కోసం ఏ మాత్రం చింతించవద్దు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకం ముద్ర యోజన కింద ప్రభుత్వ బ్యాంకులు వ్యాపారులకు రుణాలను అందిస్తున్నాయి.  రూ. 10 వేల నుంచి పది లక్షల వరకు ముద్రా రుణాలు పొందే వీలుంది.  మీరు కూడా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే మీ సమీపంలోని ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.  ముద్ర రుణం వల్ల ప్రయోజనాలు విషయానికొస్తే,  సులభ వాయిదా లోనే ఈ రుణాలను చెల్లించవచ్చు.  ప్రైవేటు వడ్డీల తరహాలో ఇవి ఉండవు. సకాలంలో రుణం చెల్లిస్తే,  మరోసారి కూడా బ్యాంకులో మీకు రుణాన్ని అందిస్తాయి. 

ప్రస్తుతం  ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్లపై నిలబడాలని అనుకునే వారి కోసం,  ఓ చక్కటి బిజినెస్ ప్లానింగ్ తెలుసుకుందాం.  ప్రస్తుత కాలంలో ఈ కామర్స్ సైట్స్ విజృంభిస్తున్నాయి.  నిత్యవసర వస్తువుల నుంచి మందులు ఎలక్ట్రానిక్స్ ఇలా అన్నింటిని కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తున్నారు. ఇ-కామర్స్ మార్కెట్ పెరిగేకొద్దీ,  లాజిస్టిక్స్ రంగంలో కూడా గణనీయమైన  పెరుగుదల కనిపిస్తోంది.  దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 

 ముఖ్యంగా నగరాలు, పట్టణాలు,  చిన్న టౌన్ లలో  ట్రాన్స్ పోర్ట్ అనేది,  అత్యవసరంగా మారింది.  ఈ నేపథ్యంలో మినీ కమర్షియల్ వెహికల్ లేదా మినీ  ట్రక్స్ కు చాలా డిమాండ్  బాగా పెరిగింది. ఒక మినీ ట్రక్ యజమాని అవడం ద్వారా,  ప్రతి నెలా చక్కటి ఆదాయం పొందే వీలుంది.  ప్రస్తుతం ఆటోమొబైల్ కంపెనీలు ఈ మినీ ట్రక్ తయారు చేస్తున్నాయి.  టాటా, మహీంద్రా,  మారుతి,  అశోక్ లేలాండ్  ఇలాంటి సంస్థలు మినీ ట్రక్స్ విభాగంలో ఉన్నాయి.  ప్రస్తుతం ఎలక్ట్రిక్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.  వీటికి పెట్రోల్ డీజిల్ తో సంబంధం లేదు. కేవలం చార్జింగ్ చేస్తే చాలు మీకు చక్కటి మైలేజీని అందిస్తాయి. 

మార్కెట్లో మినీ ట్రక్స్ ధరలు కనీసం రూ. 5 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి సామర్థ్యాన్ని బట్టి వీటి ధర మారుతుంది. మినీ ట్రక్స్ ద్వారా  అనేక రకాల సరుకులు చేరవచ్చు. మీకు రెగ్యులర్ గా ఆదాయం కావాలంటే ఏదైనా కంపెనీలో మీ వాహనాన్ని రిజిస్టర్ చేయించి,  రెగ్యులర్ గా పని పొందవచ్చు. ఇక ఈ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు,  మీరు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు,  లేదా ఆటో ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణాలను అందిస్తున్నాయి. 

 మినీ ట్రక్స్ విషయానికొస్తే,  మీరు సొంతంగా కూడా వీటిని నడపవచ్చు. పోర్టర్ లాంటి యాప్స్ లో  రిజిస్టర్ కావడం ద్వారా  ఆర్డర్స్ ను పొందవచ్చు.  ఫ్యూయల్, నిర్వహణ ఖర్చులు పోను,  ఈ మినీ ట్రక్స్ వల్ల చక్కటి ఆదాయం పొందే వీలుంది. 


 

click me!