పడిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. 2018లోనే అత్యల్ప స్థాయికి

By sivanagaprasad kodatiFirst Published Dec 25, 2018, 12:45 PM IST
Highlights

నిన్న మొన్నటి వరకు వాహనదారులను ఏడిపించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతున్న ధరలు ఈ రోజు మరింతగా తగ్గాయి. 

నిన్న మొన్నటి వరకు వాహనదారులను ఏడిపించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతున్న ధరలు ఈ రోజు మరింతగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం కావడంతో దేశీయ ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను మరోసారి సడలించడంతో 2018లోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 7 పైసలు తగ్గి రూ. 69.79గా నమోదైంది. 2018 జనవరి 4న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ అత్యల్పంగా రూ.69.97 వద్ద అమ్ముడవ్వగా.. ఈ రోజు అది ఏడాదిలోనే కనిష్టానికి తాకింది.

మరోవైపు డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ రెండు మూడు రోజుల్లో అది కూడా తగ్గే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.63.83గా ఉంది. ఈ ఏడాది మార్చి తర్వాత డీజిల్ ధర ఇంత తక్కువ ఉండటం ఇదే మొదటిసారి.

ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తే.. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.75.41 ఉండగా డీజిల్ రూ.66.79గా నమోదైంది. కోల్‌కతాలో రూ.71.89, రూ.65.59, చెన్నైలో రూ. 72.41, డీజిల్ 67.38గా నమోదైంది. 

click me!