పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారికి ఎంతో ప్రయోజనం..

Ashok Kumar   | Asianet News
Published : Aug 24, 2020, 02:30 PM IST
పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారికి ఎంతో ప్రయోజనం..

సారాంశం

యూసర్ల కోసం ఆధార్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ వంటి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నగదు డిపాజిట్, ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లను లాంచ్ చేయాలని భావిస్తోంది.

పేటీఎం యూసర్లకు గుడ్ న్యూస్, పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ ఆధార్ పేమెంట్ సేవలను ప్రారంభించింది. యూసర్ల కోసం ఆధార్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ వంటి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

త్వరలోనే నగదు డిపాజిట్, ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. "పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయవచ్చు.

also read వాటర్‌డ్రాప్-స్టల్ తో మోటో జి9 స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా లాంచ్.. ...  

దేశంలో ఆధార్‌తో అనుసంధానమైన  బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఎవరైనా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చని " అని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంక్ శాఖలు, ఎటిఎంలకు పరిమిత అక్సెస్ కలిగి ఉన్న గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

క్యాష్ డిపాజిట్, ఇంటర్‌ బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది " ఏఈపీఎస్ సర్వీసులతో మన దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగవంతం, భారతదేశంలోని మారుమూల ప్రాంతంలోని ప్రజలు పూర్తి బ్యాంకింగ్ సేవలను పొందగలిగేలా చూడాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని పేటీఎం చెల్లింపుల బ్యాంక్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ గుప్తా అన్నారు.

ఇందు కోసం 10వేలకి పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం చేసుకున్నామని  అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్