వరుసగా మళ్ళీ పెరిగిన పెట్రోల్‌ ధర.. నేడు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Aug 24, 2020, 11:34 AM IST
వరుసగా మళ్ళీ పెరిగిన పెట్రోల్‌ ధర.. నేడు ఎంతంటే ?

సారాంశం

నేటి పెంపుతో గత తొమ్మిది రోజులలో పెట్రోల్ ధరలను ఎనిమిది సార్లు పెంచారు. ఢీల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో ఆగస్టు 24 ఉదయం 6 నుంచి పెంచిన  పెట్రోల్ ధర అమల్లోకి వస్తుంది. 

దేశీయ పెట్రోల్ ధరలను సోమవారం వరుసగా ఐదవ రోజు, అనగా ఆగస్టు 24న మళ్ళీ పెంచారు, అయితే డీజిల్ రేట్లలో ప్రస్తుతం ఎలాంటి  మార్పు  లేదు. నేటి పెంపుతో గత తొమ్మిది రోజులలో పెట్రోల్ ధరలను ఎనిమిది సార్లు పెంచారు.

ఢీల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో ఆగస్టు 24 ఉదయం 6 నుంచి పెంచిన  పెట్రోల్ ధర అమల్లోకి వస్తుంది. పెట్రోల్ ధరపై లీటరుకు 12-14 పైసలు పెంచినట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్స్ తెలిపింది.

ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు. 81.49 నుండి. 81.62కు సవరించగా, డీజిల్ ధర లీటరుకు రూ.73.56 వద్ద స్థిరంగా ఉంది.

also read అండమాన్ నికోబార్ దీవులలో అల్ట్రా-ఫాస్ట్ 4జిని ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్ ...

ఢీల్లీ         పెట్రోల్ ధర రూ.81.62, డీజిల్ ధర  రూ.73.56
కోల్‌కతా    పెట్రోల్ ధర రూ.83.13, డీజిల్ ధర  రూ. 77.06
ముంబై     పెట్రోల్ ధర రూ.88.28, డీజిల్ ధర  రూ. 80.11
చెన్నై      పెట్రోల్ ధర రూ.84.64, డీజిల్ ధర  రూ. 78.86
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.84.83, ,డీజిల్ ధర  రూ. 80.17

ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోని అత్యధిక ఇంధన కేంద్రాలను కలిగి ఉన్నాయి.

ఇవి ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేట్లను సమీక్షిస్తాయి. ఉదయం 6 గంటల నుండి ఇంధన ధరల్లో ఏదైనా మార్పులు ఉంటే అమలు చేస్తాయి. ముడి చమురు ధర, విదేశీ మారకపు రేటు, స్థానిక పన్ను వంటి కారణాల వల్ల ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి.

గల్ఫ్ ఆఫ్ మెక్సికోపై తుఫాను పడటంతో ముడి చమురు ధరలు సోమవారం అధికంగా పెరిగాయి, ఇక్కడ చమురు ఉత్పత్తిలో సగానికి పైగా నిలిపివేసింది. యు.ఎస్. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు 7 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగి బ్యారెల్ 42.41 డాలర్లకు చేరుకుంది.

PREV
click me!

Recommended Stories

Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది