Paytm Loan: రూ. 5 ల‌క్ష‌ల లోన్ ఇస్తున్న పేటీఎం.. వారికి మాత్ర‌మే ఛాన్స్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 18, 2022, 03:45 PM IST
Paytm Loan: రూ. 5 ల‌క్ష‌ల లోన్ ఇస్తున్న పేటీఎం.. వారికి మాత్ర‌మే ఛాన్స్‌..!

సారాంశం

మీకు మంచి సిబిల్ స్కోర్ ఉందా.. అయితే లోన్ ఇస్తామని బ్యాంకులు, కంపెనీలు ఎగబడతాయి. ఇప్పుడు డిజిటల్ కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.

మీకు మంచి సిబిల్ స్కోర్ ఉందా.. అయితే లోన్ ఇస్తామని బ్యాంకులు, కంపెనీలు ఎగబడతాయి. ఇప్పుడు డిజిటల్ కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. క్షణాల్లో లోన్ తీసుకోవచ్చని బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ పే అనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేటీఎం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 5 లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు ఈఎంఐ ఆప్షన్ సౌకర్యం కూడా కల్పించింది.

ఈ ఆఫర్ చిరు వ్యాపారులకు మాత్రమేనని తెలిపింది. పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చని తెలిపింది. డిజిలైజేషన్ పద్ధతిలో జరిగే లోన్ ప్రక్రియలో ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ పెద్ద మొత్తంలో లోన్ మంజూరు చేస్తుంది. అయితే.. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్‌లో కొన్ని పద్ధతులును అనుసరించాల్సి ఉంటుంది.

పేటీఎం యాప్ తెరిచి.. బిజినెస్ లోన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో అక్కడ డిస్ ప్లే అవుతుంది. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత ? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు ? ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాలి అనే విషయాలు ఉంటాయి. చెక్ బాక్స్ పై క్లిక్ చేసి కొనసాగించడానికి గెట్ స్టార్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. సీకేవైసీ నుంచి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది. పాన్ వివరాలు, పుట్టిన తేదీ, అడ్రస్, ఈ మెయిల్ ఇతరత్రా అంశాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది.

ఇదీ చిరు వ్యాపారులకు మంచి ఆఫరే.. ఎందుకంటే పెట్టుబడి కోసం వారు ఇబ్బందులు పడుతుంటారు. చిటీ అని, ఫైనాన్స్ అని బాధలు ఎక్కువే ఉంటాయి. వ్యాపారం విస్తరించడానికి ఈ లోన్ ఉపయోగపడుతుంది. నిర్ణీత సమయంలో మాత్రం నగదు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే వడ్డీ బాదుడు ఉంటుందని మరచిపోవద్దు.

లోన్ పొందడానికి వ్యాపారులు యాప్ లో అనుసరించాల్సిన స్టెప్స్‌

- పేటీఎం యాప్ ను తెరిచి.. బిజినెస్ లోన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
- అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో అక్కడ డిస్ ప్లే అవుతుంది. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత ? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు ? ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాలి అనే విషయాలు అందులో ఉంటాయి.
- చెక్ బాక్స్ పై క్లిక్ చేసి కొనసాగించడానికి గెట్ స్టార్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
- సీకేవైసీ నుంచి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది.
- పాన్ వివరాలు, పుట్టిన తేదీ, అడ్రస్, ఈ మెయిల్ ఇతరత్రా అంశాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !