పేటీఎం వ్యవస్థాపకుడి రాజీనామా...తన రాజీనామా లేఖలో...

Published : Dec 11, 2019, 05:13 PM ISTUpdated : Dec 11, 2019, 05:15 PM IST
పేటీఎం వ్యవస్థాపకుడి రాజీనామా...తన రాజీనామా లేఖలో...

సారాంశం

పేటీఎం వ్యవస్థాపకుడు  విజయ్ శేఖర్ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖలో "ఇతర బాధ్యతల  రీత్యా"  ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ గా కొనసాగించలేకపోవడానికి కారణాలు అని తెలిపారు. ఆర్బిఐ నిబంధనలను పాటించటానికి ఇలా జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

భారతదేశంలోని ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. విజయ్ శేఖర్ శర్మ తన రాజీనామా లేఖలో "ఇతర బాధ్యతల  రీత్యా"  ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ గా కొనసాగించలేకపోవడానికి కారణాలు పేర్కొన్నప్పటికీ, ఆర్బిఐ నిబంధనలను ప్రకారం ఇది జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

also read  ఎస్బీఐ మొండిబకాయిలలో అవకతవకలు...నిజాన్ని బయటపెట్టిన ఆర్‌బి‌ఐ...మొత్తం ఎన్ని కొట్లో తెలుసా ?


ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం డిసెంబర్ 2 న ఈ రాజీనామా లేఖను పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డుకు పంపినట్లు, దాని తరువాత సంస్థ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ లోహియాను దాని డైరెక్టర్‌గా నియమించింది. "ఇతర బాధ్యతల కారణంగా కంపెనీ డైరెక్టర్ పదవికి తక్షణమే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ విషయంలో అవసరమైన  చర్యలు తీసుకోవాలి" అని రిజిస్ట్రార్ కంపెనీ ఢిల్లీ మరియు హర్యానా  కార్యాలయనికి పంపిన లేఖలో చెప్పారు.


పేటీఎం బ్యాంకును 2017 మేలో భారతదేశంలో ప్రారంభించారు. ఆర్థిక సేవల విభాగాన్ని ప్రారంభించడానికి రెండు నెలల ముందు శర్మ వరుసగా రెండు సంస్థలలో చైర్మన్, డైరెక్టర్ పదవులను కలిగి ఉన్నారు. ఈ రెండు సంస్థలు వాస్తవానికి ఆయన రాజీనామాకు ముందు ఆర్బిఐ నిబంధనలను పాటించలేదని తెలుస్తుంది.

also read కార్వీ లైసెన్స్ పునరుద్ధణకు ఎన్ఎస్ఈ తిరస్కరణ...?


బోర్డు డైరెక్టర్ల అంగీకారంతో రోహిత్ లోహియాను అదనపు డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించామని, తక్షణమే ఇది అమల్లోకి వచ్చేటట్లు కంపెనీ డైరెక్టర్‌గా కార్యాలయాన్ని నిర్వహిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Saree Business: ఇంట్లోనే చీరల బిజినెస్ ఇలా, తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష సంపాదించే ఛాన్స్
Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో