
ఓయో రూమ్స్ ద్వారా దేశ ఆతిథ్యం, పర్యాటక రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రితేష్ అగర్వాల్ తండ్రి 20వ అంతస్తు నుంచి పడి చనిపోయాడు. ఇటీవలే రితేష్ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో అగర్వాల్ కుటుంబంలో సంబరాల వాతావరణం నెలకొంది. అయితే ఈ రోజు జరిగిన దుర్ఘటన అగర్వాల్ కుటుంబం ఆనందాన్ని దూరం చేసింది. రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ గుర్గావ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ 20వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి చనిపోయాడు. రితేష్ అగర్వాల్, అతని భార్య, తల్లి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
రితేష్ అగర్వాల్ DLF ది క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్, DLF సెక్టార్ 54లో నివసిస్తున్నారు. రితేష్ తల్లిదండ్రులు కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో అందరూ ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. తండ్రి రమేష్ అగర్వాల్ బాల్కనీకి వచ్చారు. ఇంటి లోపల కుటుంబ సభ్యులు తమ పనుల్లో మునిగిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే రమేష్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. రమేష్ అగర్వాల్ 20వ అంతస్తు నుంచి పడిపోవడంతో శరీరం ఛిద్రమైంది. ఈ ప్రమాదంలో రమేష్ అగర్వాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
తన తండ్రిని విడిచిపెట్టడం పట్ల రితేష్ అగర్వాల్ స్వయంగా ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. నాకు, కుటుంబానికి బలం, మార్గదర్శిగా నిలిచిన మా నాన్న రమేష్ అగర్వాల్ నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతను పూర్తి జీవితాన్ని గడిపాడు. ఆయన నాకు, నాలాంటి మరెందరికో ప్రతిరోజూ స్ఫూర్తిగా నిలిచారు. మా నాన్న మరణం నాకు, నా కుటుంబానికి తీరని లోటు. తండ్రి చెప్పే ప్రతి మాట, క్రియ, కష్టకాలంలో నడిపించే తీరు మనకు మార్గదర్శకం. ఆయన ప్రతి మాట మన హృదయాల్లో ముద్రించబడదు. ఈ కష్ట సమయంలో తన వ్యక్తిగత సమయాన్ని గౌరవించాలని రితేష్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.