ఇక ఫ్లిప్‌కార్ట్, ఓలా క్రెడిట్ కార్డులూ వచ్చేస్తాయి!

By rajashekhar garrepallyFirst Published May 3, 2019, 4:36 PM IST
Highlights

ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా క్రెడిట్ కార్డుల రంగంలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంభించాయి. పెద్ద బ్యాంకుల సౌజన్యంతో ఈ సంస్థలు తమ వినియోగదారులకు క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 
 

ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా క్రెడిట్ కార్డుల రంగంలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంభించాయి. పెద్ద బ్యాంకుల సౌజన్యంతో ఈ సంస్థలు తమ వినియోగదారులకు క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

ఎక్కువగా కొనుగోళ్లు చేసే వారి కోసం ఈ కార్డులు ఉపయోపడనున్నాయని సంబంధిత వ్యక్తులు తెలిపారు. తమ కార్డు వినియోగదారుల ఖర్చులపై ఒక అంచనాకు రావడంతో పాటు క్రెడిట్‌ కార్డ్‌ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు.

క్రెడిట్ కార్డు సిస్టంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆవిష్కరించేందుకు ఓలా సిద్ధమైంది. వచ్చే వారం ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని ఆ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. 

తనకున్న 150 మిలియన్ కస్టమర్లను ఆధారంగా చేసుకుని తొలి ఏడాది ఒక మిలియన్ కార్డులను జారీ చేయనున్నట్లు వివరించారు. డిజిటల్ పేమెంట్స్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. 

ఇక ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా హెచ్‌డీఎఫ్‌సీ సౌజన్యంతో వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులను అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ‘బై నౌ.. పే లేటర్’ అనే విధానాన్ని తమ వినియోగదారులకు తీసుకొచ్చింది. 

కాగా, గత సంవత్సరం అక్టోబర్ లోనే అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్‌తో జట్టు కట్టి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. కాగా, విలువైన కస్టమర్లకు తగిన సేవలు అందించడం కోసం ఇలాంటి భాగస్వామ్యాలు అవసరమవుతాయని పీడబ్ల్యూసీ ఫిన్‌టెక్ లీడర్ వివేక్ భార్గవి తెలిపారు.

click me!