వంట గ్యాస్ ధర మళ్ళీ పెరిగింది...సిలిండర్ పై ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Feb 12, 2020, 1:03 PM IST

సబ్సిడీ లేని ఎల్‌పిజి (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) లేదా వంట గ్యాస్ ధరలను బుధవారం నుంచి పెంచారు. వంట గ్యాస్ ధర పెంచడం ఇది వరుస ఆరవ సారి .12 ఫిబ్రవరి 2020 నుండి మెట్రోల నగరాలలో నాన్ - సబ్సిడీ ఎల్‌పి‌జి  ధరలు ఇలా ఉన్నయి


వంట గ్యాస్ పై ప్రభుత్వం మరింత భారం పెడుతుంది. సబ్సిడీ లేని ఎల్‌పిజి (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) లేదా వంట గ్యాస్ ధరలను బుధవారం నుంచి పెంచారు. వంట గ్యాస్ ధర పెంచడం ఇది వరుస ఆరవ సారి. ఢిల్లీ, ముంబై నగరంలో ఒక్క సిలిండర్‌కు రూ .144.5 నుంచి రూ .145 గా పెంచిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.

ఫిబ్రవరి 12 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం నాన్ - సబ్సిడీ ఎల్‌పిజి ధరలు ఢిల్లీలో సిలిండర్‌కు రూ .858.5 ఉండగా, ముంబైలో సిలిండర్‌ ధర రూ 829.5 ఉంది. 12 ఫిబ్రవరి 2020 నుండి మెట్రోల నగరాలలో నాన్ - సబ్సిడీ ఎల్‌పి‌జి  ధరలు ఇలా ఉన్నయి.

Latest Videos

also read  ఒకటికన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలీ...లేదంటే..?

 నాన్-సబ్సిడీ ఎల్పిజి 14.2 కిలోల సిలిండర్ ధర
 

                          కొత్త ధర               పాత  ధర
ఢిల్లీ                   858,50                   714,00
కోలకతా             896,00                    747,00
ముంబై              829,50                    684,50
చెన్నై                881,00                    734,00

మంగళవారం వరకు రెండు మెట్రోల్లో నగరాలలో  సిలిండర్‌ ధరలు రూ .684.5, సిలిండర్‌ నుండి  రూ .714గా ఉన్నాయని ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ - iocl.com తెలిపింది. కోల్‌కతాలో నాన్ సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్‌ ధర రూ .149 పెంచింది ప్రస్తుత పెంచిన ధరతో సిలిండర్‌కు రూ .896.00 ఉంది, చెన్నైలో  సిలిండర్‌ పై రూ .147 పెంచటంతో  ఒక సిలిండర్‌ ప్రస్తుత ధర రూ .881.00 ఉంది.

సాధారణంగా ఎల్‌పిజి సిలిండర్ రేట్లలో ఏవైనా మార్పులు ఉంటే అది ఆ నెల ప్రారంభంలో సప్లయ్ చేసే వారి వల్ల ప్రభావితమవుతాయి. ఎల్‌పిజి సిలిండర్ ధర (14.2 కిలోగ్రాములకు)ను కుములేటివ్ ఢిల్లీలో నగరంలో  రూ. 284 పెంచింది. ముంబైలో సిలిండర్‌కు రూ.283 రూపాయలు పెంచింది.  2019 ఆగస్టు నుంచి ఇప్పటివరకు వరుసగా 49.43 శాతం నుంచి 51.78 శాతం పెరుగుదల ఉంది.

also read సుందర్ పిచాయ్ కి వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

ఇండియన్ ఆయిల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల నుండి 19 కిలోల సిలిండర్ల ధరలను ఢిల్లీలో యూనిట్‌కు  రూ.1,241.00 నుండి రూ.1,466.00కు, ముంబైలో  రూ.1,190.00 నుండి రూ.1,540.50 రూపాయలుగా సవరించారు. ప్రస్తుతం సంవత్సరానికి  14.2 కిలోగ్రాముల చొప్పున 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. 

సంవత్సరానికి 12 సిలిండర్ల కోటాపై ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం ప్రతి నెలకు మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ బెంచ్ మార్క్ ఎల్పిజి ధరలలో మార్పులు, విదేశీ మారకపు రేట్లు వంటి అంశాలలు సబ్సిడీ మొత్తాన్ని నిర్ణయిస్తాయి.
 

click me!