ఆర్బీఐ మేకిట్ క్లియర్.. జనవరి నుంచి నో ‘నిఫ్ట్’ చార్జెస్

By Sandra Ashok KumarFirst Published Nov 9, 2019, 12:07 PM IST
Highlights

వివిధ బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుభవార్తనందించింది. 2020 జనవరి నుంచి నెఫ్ట్‌ సేవలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపింది. డిజిటల్ చెల్లింపులు పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నది.

న్యూఢిల్లీ: సేవింగ్‌ బ్యాంకు ఖాతా దారులకు భారతీయ రిజర్వు బ్యాంకు  (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. 2020 జనవరి నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్‌ (నెఫ్ట్‌) సేవలు ఉచితంగా అందించాలని ఆర్బీఐ నిర్ణయించింది.

also read నో డౌట్...ఇప్పట్లో భారత్... కోలుకునే అవకాశాల్లేవ్ : మూడీస్ హెచ్చరిక

ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం తమ లక్ష్యమని, ఈ ప్రయత్నాల వల్ల రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

అక్టోబర్ 2018-సెప్టెంబర్ 2019 వరకు మొత్తం నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపులు 96శాతంగా ఉన్నాయి. అదే సమయంలో నెఫ్ట్‌, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థలు సంవత్సరానికి 252 కోట్లు, 874 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి.

aslo read నోట్ల రద్దుకు మూడేళ్లు...రూ.2000 నోటూ రద్దు చేయాలి

నెఫ్ట్‌ లావాదేవీలు 20 శాతం, యూపీఐ లావాదేవీలు 263శాతం వృద్ధిని సాధించాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌), నెఫ్ట్‌ ఆర్బీఐ అందిస్తున్న రియల్‌ టైం పేమెంట్‌ వ్యవస్థలు. నెఫ్ట్‌  ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు నిధుల బదిలీ చేయవచ్చు. ఆర్‌టీజీఎస్‌ పెద్ద మొత్తంలో నిధులను తక్షణమే బదిలీ  చేసుకోవచ్చు.
 

click me!