ఇషా -ఆనంద్ పిరమల్ కవలల ఫస్ట్ బర్త్ డే : హాజరైన నీతా, ముఖేష్ అంబానీ.. తరలివచ్చిన సెలబ్రెటీలు

By Siva Kodati  |  First Published Nov 18, 2023, 8:21 PM IST

ఇషా అంబానీ, ఆనంద్ పరమిల్ దంపతుల కవల పిల్లలు ఆదియా, కృష్ణల తొలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు. 


రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ ఆయన కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పరమిల్ దంపతుల కవల పిల్లలు ఆదియా, కృష్ణల తొలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా అద్వానీ నుండి హార్దిక్ పాండే వరకు ఈ పుట్టినరోజు పార్టీలో భాగమయ్యారు. ఈ పార్టీలో ఆదిత్య, కృష్ణలు నాని నాని ఒడిలో కనిపించారు. ఇద్దరూ రంగురంగుల దుస్తులలో చాలా అందంగా కనిపించారు. ఈ పార్టీలో ఆదిత్య, కృష్ణలను ముఖేష్, నీతాలు ముద్దు చేస్తూ కనిపించారు. చిన్నారులిద్దరూ రంగురంగుల దుస్తులలో చాలా అందంగా కనిపించారు. 

Latest Videos

పలువురు సినీ ప్రముఖులు తమ పిల్లలతో కలిసి ఈ పార్టీలో పాల్గొన్నారు. కరణ్ జోహార్.. రూహి, యష్‌లతో కలిసి పార్టీకి వచ్చారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య , భార్య నటాషాతో కలిసి హాజరయ్యారు. కియారా అద్వానీ తన తల్లితో కలిసి ఈ పార్టీకి వచ్చారు. ఈమె ధరించిన పూల ప్రింట్ గౌను అట్రాక్షన్‌గా నిలిచింది. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ కూడా తన ఇద్దరు పిల్లలతో పార్టీకి హాజరయ్యారు.

కాగా.. ఇషా అంబానీకి, ప్రముఖ పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమిల్‌తో 2018 డిసెంబర్ 12న వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు గతేడాది నవంబర్ 19న తల్లిదండ్రులయ్యారు. ఇషా అంబానీ ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు. అనంతరం అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

ఈమె రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో చేరడానికి ముందు అమెరికాలోని మెకన్జీ అండ్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేశారు. రిలయన్స్ జియో స్థాపన , సక్సెస్ విషయంలో ఇషా అంబానీది ముఖ్య పాత్ర. ఆ వెంటనే అజియోను కూడా ప్రారంభించి దానిని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త ఆనంద్ పిరమల్ పిరమల్ గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.


 

click me!