ICC వరల్డ్ కప్ మానియా :ఒక్క హోటల్ రూం.. ఫ్లయిట్ టికెట్ ధర తెలిస్తే చుక్కలే.. కళ్ళు చెదిరే బిజినెస్..

By asianet news telugu  |  First Published Nov 18, 2023, 2:48 PM IST

ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం నగరంలోని టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో మ్యాచ్ రాత్రికి హోటల్ రూమ్ రెంట్  రూ. 2 లక్షల వరకు పెరిగాయి, ఇతర హోటళ్లు కూడా వాటి ధరలను ఐదు నుండి ఏడు రెట్లు  పెంచాయి. 
 


రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ టీం నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో   ICC మెన్స్ వరల్డ్  కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.  అయితే ఈ మ్యాచ్ చూసేందుకు  దేశం నలుమూలాల నుండి అభిమానులు  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. దింతో ఇక్కడి  హోటల్ రూమ్ చార్జెస్,  నగరానికి చేరుకోవడానికి విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకాయి.

ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం నగరంలోని టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లలో మ్యాచ్ రాత్రికి హోటల్ రూమ్ రెంట్  రూ. 2 లక్షల వరకు పెరిగాయి, ఇతర హోటళ్లు కూడా వాటి ధరలను ఐదు నుండి ఏడు రెట్లు  పెంచాయి. 

Latest Videos

undefined

ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్‌లోనే కాదు దుబాయ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పాటు విదేశాల నుంచి కూడా ఈ మ్యాచ్‌ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ గుజరాత్ నరేంద్ర సోమానీ అన్నట్లు  పిటిఐ పేర్కొంది. 

"అహ్మదాబాద్‌లో త్రీ స్టార్ అండ్  ఫైవ్ స్టార్ హోటళ్లలో 5,000 గదులు ఉన్నాయి, ఇతర హోటళ్లతో మొత్తం గుజరాత్‌లో 10,000 గదులు ఉన్నాయి. నరేంద్ర మోడీ స్టేడియం సామర్థ్యం 1.20 లక్షల మందికి పైగా ఉంది. అయితే దేశం బయటి నుండి మ్యాచ్ చూడటానికి 30,000 నుండి 40,000 మంది వస్తారని మేము భావిస్తున్నాము" అని చెప్పారు.

హోటల్ గదులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున వాటి రేట్లు కూడా పెరుగుతున్నాయని, ఇంతకుముందు నామమాత్రపు ధరలకు లభించే గదులు ఎక్కడైనా రూ.50,000 నుండి రూ.1.25 లక్షల మధ్య  తాకినట్లు ఆయన చెప్పారు .

"ప్రజలు హోటళ్లను బుక్ చేసుకునే ముందు ముందుగా విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. అహ్మదాబాద్‌లోనే కాకుండా చుట్టుపక్కల పట్టణాల్లో కూడా మ్యాచ్ రోజు వచ్చేసరికి గదుల ధరలు పెరుగుతాయి" అని ఆయన చెప్పారు.

అంతే కాకుండా, ఫైవ్ స్టార్ హోటళ్ల వివిధ హోటల్ బుకింగ్ సైట్‌లలో ఆన్‌లైన్ రేట్లు రాత్రికి రూ.2 లక్షలకు చేరుకున్నాయి .

ITC నర్మద, హయత్ రీజెన్సీ వంటి హోటళ్లకు మ్యాచ్ జరిగే రాత్రికి ఆన్‌లైన్ టారిఫ్ రూ.2 లక్షల కంటే ఎక్కువ. ఇదొక్కటే కాదు, నాన్ స్టార్ హోటళ్లు కూడా రద్దీని క్యాష్ చేసుకోవడానికి ఐదు నుండి ఏడు రెట్లు రెంట్లను పెంచాయి. సాధారణంగా రాత్రికి రూ.3,000 నుండి రూ. 4,000 వరకు వసూలు చేసే CG రోడ్‌లోని హోటల్ క్రౌన్, దాని రేటును రూ. 20,000 కి పెంచినట్లు దాని సిబ్బంది వెల్లడించారు.

విమాన ఛార్జీలు:
ఇండియా vs ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్‌ కోసం వివిధ ప్రాంతాల నుండి అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీలు సాధారణ ధరలతో పోలిస్తే భారీగా పెరిగాయి. చెన్నై నుండి వచ్చే విమానాల కోసం సాధారణ సమయాల్లో రేట్లు రూ.5,000, కానీ  ఇప్పుడు రూ.16,000 నుండి రూ.25,000 పలుకుతుంది.

"అహ్మదాబాద్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నందున, దాదాపు అన్ని ప్రాంతాల నుండి నగరానికి విమానాల కోసం విమాన ఛార్జీలు మూడు నుండి ఐదు రెట్లు పెరిగాయి. క్రికెట్ అభిమానులు అధిక ధరలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ అవకాశం ఇంకా ఇండియా   సొంత దేశంలో ఫైనల్స్ ఆడుతున్నందున  హోటళ్లు రూమ్స్, వినుమా టిక్కెట్‌లకు డిమాండ్ పెరుగుతోంది"  అని ట్రావెల్ ఏజెంట్ మనుభాయ్ పంచోలి అన్నారు. 

click me!