తొలి భారతీయురాలిగా నీతా అంబానీకి అరుదైన గౌరవం

By Sandra Ashok Kumar  |  First Published Nov 13, 2019, 1:52 PM IST

విద్యావేత్త, పరోపకారి, మరియు వ్యాపారస్తురాలు నీతా అంబానీ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కు గౌరవ ట్రస్టీగా పేరు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని  చైర్మన్ డేనియల్ బ్రోడ్స్కీ ప్రకటించారు. బోర్డు నవంబర్ 12 సమావేశంలో శ్రీమతి అంబానీ ఎన్నిక జరిగింది. ఇంతటి  గొప్ప గౌరవం దక్కిన తొలి భారతీయురాలు ఆమె. 


ముంబై : విద్యావేత్త, వ్యాపారస్తురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్  చైర్మన్ ముకేశ్‌ అంబానీ భార్య, నీతా అంబానీ (57) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కు గౌరవ ట్రస్టీగా పేరు తెచ్చుకున్నారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న ఆమె న్యూయార్క్‌లో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం బోర్డులో స్థానం దక్కడం విశేషం.

ప్రపంచం నలుమూలల నుండి కళను అధ్యయనం చేసి, ప్రదర్శించే మ్యూజియం సామర్థ్యానికి నీతా అంబానీ మద్దతు భారీ ప్రయోజనాన్ని చేకూర్చిందని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్మన్ డేనియల్ బ్రోడ్స్‌స్కీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Latest Videos

aslo read హువావే బంపర్ ఆఫర్ : ఉద్యోగులకు డబుల్ ధమాకా

బోర్డు నవంబర్ 12న జరిగిన సమావేశంలో శ్రీమతి నీతా అంబానీ ఎన్నిక జరిగింది. ఇంతటి గొప్ప గౌరవం దక్కిన తొలి మొదటి భారతీయురాలిగా స్థానం దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీని మ్యూజియం గౌరవ ధర్మకర్తగా ఎంపి‍క చేసినట్టు తెలిపారు.

నీతా అంబానీ మాట్లాడుతూ "భారతదేశపు కళలను ప్రదర్శించే కార్యక్రమాన్ని విస్తరించడం, వృద్ధి చేయాలనే ఆకాంక్షతో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కు మద్దతు ఇవ్వడం కొరకు గత అనేక సంవత్సరాలుగా ఇది నాకు ఎంతో ప్రతిఫలదాయకంగా ఉంది. 

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో పనిచేసిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి గడించిన నీతా అంబానీ క్రీడల రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి భారత రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహాన్ అవార్డును అందుకున్నారు.  

also read ప్రీమియం సెగ్మెంట్లో ‘ఐఫోన్’దే హవా!

ఆసియాలో అత్యంత శక్తివంతమైన 50 మంది వ్యాపారవేత్తల  ఫోర్బ్స్‌ జాబితాలో  కూడా ఒకరిగా నిలిచారు. రిలయన్స్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ రిలయన్స్‌ ఫౌండేషన్‌  ఛైర్మన్‌గా ఉన్న నీతా అంబానీ దేశీయంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, సంస్కృతి,కళలు, క్రీడాభివృద్ధి కోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ లో కూడా  ప్ర‌తి ఏడాది ఆమె షోలను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 149 సంవత్సరాల పురాతనమైన మెట్రోపాలిటన్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా 5,000 సంవత్సరాల నుండి విస్తరించి ఉన్న కళలను ప్రదర్శిస్తుంది. ప్రతి ఏటా మిలియన్ల మంది బిలియనీర్లు, ప్రముఖులు ఈ  మ్యూజియాన్ని సందర్శిస్తారు. 

click me!