Budget 2020: మళ్లీ అదే ఎర్రని వస్త్రం బ్యాగుతో నిర్మల... తొలుత రాష్ట్రపతి వద్దకు.. ఆపై పార్లమెంట్‌కు!!

Ashok Kumar   | Asianet News
Published : Feb 01, 2020, 11:17 AM ISTUpdated : Feb 01, 2020, 11:26 AM IST
Budget 2020: మళ్లీ అదే ఎర్రని వస్త్రం బ్యాగుతో నిర్మల... తొలుత రాష్ట్రపతి వద్దకు.. ఆపై పార్లమెంట్‌కు!!

సారాంశం

నిర్మలాసీతారామన్ మళ్లీ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఎర్రని వస్త్రంతో కూడిన సంచీ బ్యాగులోనే బడ్జెట్ ప్రతులను తీసుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. అటుపై పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు. 

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చే సూట్​కేసు​ సంప్రదాయానికి స్వస్తి పలికి గత ఏడాది ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్​ కొత్తగా ఎర్రని వస్త్రం బ్యాగుతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఎర్రటి వస్త్రంతో కూడిన బ్యాగుతో బడ్జెట్​ ప్రతులను తీసుకుని పార్లమెంట్​కు బయలుదేరారు.

also read  Budget 2020: నిర్మలమ్మ పద్దు.. అప్పుడు పేరెంట్స్, ఇప్పుడు కూతురు


ఆర్థిక శాఖ కార్యాలయంలో ముందస్తు కసరత్తు చేపట్టిన నిర్మలా సీతారామన్ గోల్డ్ కలర్ శారీలో నిరాడంబరంగా నార్త్ బ్లాక్ లోని తమ ఆర్థికశాఖ కార్యాలయం నుంచి తమ బృందంతో బయలుదేరారు. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను పట్టుకుని రాష్ట్రపతిని కలిశారు. అక్కడి నుంచి పార్లమెంట్​కు రానున్నారు.

 

ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేడు 2020-21 వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. క్రితంసారి సూట్​కేసు సంప్రదాయానికి చెక్​ పెట్టి ఎర్రటి వస్త్రంతో కూడిన సంచీలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

also read Budget 2020: బడ్జెట్‌కు ముందు ఇంట్లో ప్రార్థనలు చేసిన ఆర్థిక మంత్రి

ఎర్రని వస్త్రంతో కూడిన బడ్జెట్ సంచీకి బంగారం రంగులో జాతీయ చిహ్నం ఉంది. ఈ చిహ్నం ముద్రకే తాళంచెవి ఉంటుంది. దాంతో సంచిని తెరిచే వీలు ఉంటుంది. 

అంతకుముందు వరకు బడ్జెట్ పత్రాలను ఆర్థిక మంత్రులు భ్రీప్ కేసులో తీసుకు వచ్చేవారు. అయితే గతేడాది నిర్మలా సీతారామన్ ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు. బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసంలో ఉన్న దేవుడి విగ్రహం ముందు పూజలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే