Budget 2020: బడ్జెట్‌కు ముందు ఇంట్లో ప్రార్థనలు చేసిన ఆర్థిక మంత్రి

Ashok Kumar   | Asianet News
Published : Feb 01, 2020, 11:04 AM IST
Budget 2020: బడ్జెట్‌కు ముందు ఇంట్లో ప్రార్థనలు చేసిన  ఆర్థిక మంత్రి

సారాంశం

బడ్జెట్ సెషన్ 2020: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టీం బడ్జెట్‌లో కీలక సభ్యుడైన ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల ఢిల్లీ ప్రచార ర్యాలీలో చర్చనీయాంశంగా ఉన్నారు.    

న్యూ ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రకటనకు కొన్ని గంటల ముందు ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ తన ఇంటి వద్ద ప్రత్యేక ప్రార్థన చేస్తూ కనిపించారు.రస్ట్ జాకెట్, తెలుపు కుర్తాలో మంత్రి తన ఇంటి వద్ద హనుమాన్ విగ్రహం ముందు ప్రార్థన చేస్తు కనిపించారు.

"మోడీ ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్" ను నమ్ముతుంది. మాకు దేశవ్యాప్తంగా దీనిపై సూచనలు వచ్చాయి.ఈ బడ్జెట్ అందరికీ సంతోషకరంగా, ప్రజలకు, దేశానికి ఉపయోగకరంగా  ఉంటుందని అని నిర్ధారించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది, ”అని ఠాకూర్ ఒక వార్తా సంస్థకి చెప్పారు.

also read Budget 2020:బడ్జెట్ సూట్​కేస్ వాడకంలో ట్రెండ్ మార్చిన నిర్మల’మ్మ...మరి ఈసారెలా ?!

శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం బడ్జెట్ ప్రెస్ లైబ్రరీలోని పురాతన పుస్తకాలలో ఒక అరుదైన పుస్తకం ఫోటోని ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాలు రెండు సంపుటాలను కలిగి ఉంది.

"బడ్జెట్ 2020 సందర్భంగా, మేము బడ్జెట్ ప్రెస్ లైబ్రరీలో పురాతన పుస్తకాలను పరిచయం చేశాం. ఇది 1947 నుండి భారతదేశ ఆర్థిక పరివర్తనను వివరిస్తుంది. బడ్జెట్ ప్రసంగం బహుశా అన్ని ప్రసంగాలలో అత్యంత రక్షణగా ఉంటుంది" అని ఠాకూర్ కార్యాలయం ట్వీట్ చేసింది.

also read Budget 2020: రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టీం బడ్జెట్‌లో కీలక సభ్యుడైన అనురాగ్ ఠాకూర్ ఇటీవల ఢిల్లీ ప్రచార ర్యాలీలో చర్చనీయాంశంగా మారారు.  ఢిల్లీలో మూడు రోజుల పాటు అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేయకుండా నిషేధించారు. మిస్టర్ ఠాకూర్ వీడియోను ఎన్నికల సంఘం దర్యాప్తు చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు