ఆత్మహత్యే శరణ్యం.. నన్ను భారత్‌కు అప్పగించొద్దు: లండన్ కోర్టులో నీరవ్ మోడీ అప్పీల్

By Siva KodatiFirst Published Jul 21, 2021, 5:56 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు  13,500 కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ మరో కొత్త ఎత్తుగడ వేశారు. భారత్‌కు తనను అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమని కోర్టుకు తెలిపారు.

లండన్ కోర్టులో అప్పీల్‌కు వెళ్లిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భారత్‌కు అప్పగించొద్దని కోర్టును కోరిన నీరవ్ మోడీ.. భారత్‌కు తనను అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. కొద్దిరోజుల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం నిందితుడు నీరవ్ మోడీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. హైకోర్టు అప్పీల్‌కు కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఇండియాకు అతనిని అప్పగించే మార్గం సుగమమైంది. 13,500 కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ దేశంలోని ఆర్ధిక నేరాల్లో నిందితుడు కావడంతో అతనిని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు ఇచ్చింది. ఇండియాలో మనీలాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలు ఎదుర్కోవాల్సిందేనని తేల్చింది. 

ALso Read:విజయ్ మాల్యా, నీరవ్ మోడిలకు షాకిచ్చిన ఈడీ.. రూ.792 కోట్ల ఆస్తుల జప్తు..

కాగా, బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు పొంది విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు  మరో పెద్ద దెబ్బ తగిలింది. రుణాల ఎగవేత కేసుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని బృందం విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు  చెందిన జప్తు చేసిన షేర్ల అమ్మకాల నుంచి రూ .792.11 కోట్లు వసూల్ చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తెలిపింది

click me!