18 నెలల్లో రెండోసారి.. ఆర్ధిక మాంద్యం గుప్పిట్లో న్యూజిలాండ్..

By Ashok kumar Sandra  |  First Published Mar 21, 2024, 1:48 PM IST

న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ గత 18 నెలల్లో రెండోసారి మాంద్యంలో పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం, గత త్రైమాసికంలో న్యూజిలాండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్  (జిడిపి) 0.1 శాతం క్షీణించింది. 
 


న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ గత 18 నెలల్లో రెండోసారి మాంద్యంలో పడిపోయింది. తాజా గణాంకాల ప్రకారం, గత త్రైమాసికంలో న్యూజిలాండ్  గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్  (GDP) 0.1 శాతం క్షీణించింది. అంతకుముందు త్రైమాసికంలో కూడా జిడిపి 0.3 శాతం తగ్గింది.  ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో 0.1 శాతం వృద్ధిని అంచనా వేశారు. ఏదైనా ఆర్థిక వ్యవస్థలో వరుసగా రెండు త్రైమాసికాల్లో క్షీణత మాంద్యంగా పరిగణించబడుతుంది.

గత 5 త్రైమాసికాల్లో 

Latest Videos

  న్యూజిలాండ్ అధికారిక గణాంకాల ఏజెన్సీ ప్రకారం, న్యూజిలాండ్ GDP గత 5 త్రైమాసికాల్లో 4 ప్రతికూల గణాంకాలను చూపింది ఇంకా  అన్యువల్ రేటు 0.6 శాతం మాత్రమే ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం, తలసరి ఆదాయం 0.7 శాతం క్షీణించింది. అదే సమయంలో, నిపుణులు ఇప్పటికే మాంద్యం అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థ ఫ్లాట్‌గా ఉండే అవకాశం ఉందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ ఇప్పటికే వ్యక్తం చేసింది.

న్యూజిలాండ్ 2022 నుండి మాంద్యంలో 

గతేడాది కూడా న్యూజిలాండ్ మాంద్యం గుప్పిట్లో ఉంది. 2022 చివరి నాటికి 0.7 శాతం క్షీణత తర్వాత 2023 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం తగ్గింది. సోర్సెస్ ద్వారా, న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం సంకేతాలు GDP వేగంలోనే కాకుండా అనేక ఇతర కారణాల వల్ల కూడా కనిపిస్తాయి. వీటిలో ఉత్పత్తి, రిటైల్ అమ్మకాలు, ఆదాయం ఇంకా ఉపాధి తగ్గింపు కూడా ఉన్నాయి. అదే సమయంలో, ఈ త్రైమాసికంలో క్షీణతకు అతిపెద్ద కారణం హోల్‌సేల్ వ్యాపారం మందగించడం. న్యూజిలాండ్‌లో ఆహారం ఇంకా పానీయాలతో పాటు మద్యం, మెషీన్స్ అండ్ డివైజెస్  అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గాయి.

జనాభా పెరుగుదల లేకుండా, న్యూజిలాండ్ ఆర్థిక పరిస్థితి మరింత వేగంగా జారిపోతోంది. రెగ్యులేషన్ మంత్రి డేవిడ్ సేమౌర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దేశంలోని రాబోయే బడ్జెట్‌లో కోతలకు దారితీస్తాయని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యకు కోత కూడా ఉంటుందని అన్నారు. 
 

click me!