నేటి నుండి కొత్త రూల్స్: NPS, Fastag, క్రెడిట్ కార్డ్స్ సహా ఇవన్నీ చేంజ్...

By Ashok kumar Sandra  |  First Published Apr 1, 2024, 3:21 PM IST

 కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభమైంది. దీనితో పాటు, మీ పాకెట్ బడ్జెట్ ని  ప్రభావితం చేసే అనేక నియమాలు కూడా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో జరిగే నియమాలలో మార్పుల ప్రకారం మీరు మీ చేయాల్సిన  పనిని సకాలంలో పూర్తి చేయడం ముఖ్యం. 
 


ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ. నేటి నుండి  2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. దీనితో పాటు, మీ బడ్జెట్ ను ప్రభావితం చేసే కొన్ని రూల్స్ కూడా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో జరిగే నియమాలలో మార్పుల ప్రకారం మీరు చేయాల్సిన పనిని ఆలోచించి పూర్తి చేయడం ముఖ్యం.  ఏప్రిల్ 1, 2024 నుండి ఎలాంటి రూల్స్ లో మార్పులు జరగబోతున్నాయో చూద్దాం... 

ఎన్‌పీఎస్‌లో మార్పులు:
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో నేషనల్ పేమెంట్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)కి సంబంధించిన నిబంధనలలో మార్పులు రానున్నాయి. నేటి నుండి ఏప్రిల్ 1న NPS అకౌంట్  లాగిన్ చేయడానికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి అయింది. కస్టమర్లు దీనికి  సంబంధించిన ప్రక్రియ గురించి సకాలంలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Latest Videos

ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన రూల్స్ లో మార్పులు:
ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన కొన్ని నియమాలు కూడా ఏప్రిల్ 1, 2024 నుండి మారుతున్నాయి. మీరు మీ కారు ఫాస్ట్ ట్యాగ్  బ్యాంక్ KYCని ఇంకా పూర్తి చేయకుంటే, ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు మార్చి 31, 2024లోపు మీ Fastag KYC ప్రక్రియను పూర్తి చేయకుంటే, మీ Fastag అకౌంట్ డియాక్టీవ్  చేయబడవచ్చు లేదా బ్యాంక్ ద్వారా బ్లాక్‌లిస్ట్ చేయబడవచ్చు. ఇలా జరిగితే, మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లోని బ్యాలెన్స్‌ని ఉపయోగించడంలో మీరు ఇబ్బంది ఎదురవవచ్చు .

EPFO కస్టమర్లకు రిలీఫ్  
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే EPFOకి సంబంధించిన నియమాలు కూడా ఏప్రిల్ 1, 2024 నుండి మారబోతున్నాయి. EPFO కస్టమర్లు ఈ మార్పు నుండి ఉపశమనం పొందబోతున్నారు. వాస్తవానికి, ఏప్రిల్ 1 నుండి, ఖాతాదారులు   పాత PF బ్యాలెన్స్‌ను ఉద్యోగం మారినప్పుడు  కొత్త అకౌంట్ కు మాన్యువల్‌గా బదిలీ చేయవలసిన అవసరం లేదు. పాత PF   బ్యాలెన్స్ ఆటో మోడ్‌లోనే కొత్త ఖాతాకు లింక్ చేయబడుతుంది. ప్రస్తుతం, UAN నంబర్ ఉన్నప్పటికీ, PF అకౌంట్   బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి కస్టమర్ విడిగా అభ్యర్థన చేయాల్సి వచ్చేది.

పాన్-ఆధార్ లింక్: 
పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్‌లను లింక్ చేయడానికి ప్రభుత్వం చాలాసార్లు గడువును పొడిగించింది. ప్రస్తుతం, ఆధార్ పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ 31 మార్చి 2024. మీరు మీ పాన్ కార్డ్ ఇంకా  ఆధార్ కార్డ్‌ని ఇంకా లింక్ చేయకుంటే, మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా మారవచ్చు, ఇది మీకు అనేక సమస్యలను కలిగించవచ్చు. దీన్ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి, మీరు రూ. 1000 జరిమానా కూడా చెల్లించాలి. 

LPG ధరలలో మార్పు 
కమర్షియల్ అండ్   వంటింటి  LPG సిలిండర్ల ధరను ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సమీక్షిస్తుంది. దీని కింద, పెట్రోలియం కంపెనీలు ఈ రోజు నుండి అంటే ఏప్రిల్ 1, 2024 నుండి కమర్షియల్ LPC సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్, ఐదు కిలోల ఎఫ్‌టిఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి) సిలిండర్ ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.30.50 తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు: నేటి నుండి అంటే ఏప్రిల్ 1, 2024 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన నియమాలలో మార్పులు జరిగాయి. SBI క్రెడిట్ కార్డ్ రూల్స్ నేటి నుంచి మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డ్ ద్వారా ఛార్జీల చెల్లింపుపై ఇకపై రివార్డ్ పాయింట్లు జారీ చేయదు. ఈ నియమం ఏప్రిల్ 15, 2024 నుండి అనేక ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తించవచ్చు.

కొత్త ఆదాయపు పన్ను విధానంలో  మార్పు  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-25లో ప్రజల కోసం కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ITR ఫైల్ చేసేటప్పుడు ఈ ఏర్పాటును నిలిపివేయవచ్చు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విడుదలైన సమాచారం తర్వాత మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది.

click me!