పెట్రోల్ - డీజిల్ కొత్త ధరలు.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

Published : Oct 07, 2022, 09:15 AM IST
పెట్రోల్ - డీజిల్ కొత్త ధరలు.. మీ నగరంలో లీటరు ధర  ఎంతో తెలుసుకోండి..

సారాంశం

ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర లీటరుకు రూ.89.96గా ఉంది.

 ఇంధన ధరల పెంపు ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా కనిపిస్తోంది. భారతీయ చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా ఈరోజు (శుక్రవారం), అక్టోబర్ 07న తాజా పెట్రోల్, డీజిల్ ధరలను అప్‌డేట్ చేశాయి. నేటికీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని అన్ని నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. క్రూడాయిల్‌ ధరలలో చాలా అస్థిరత ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.

ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర లీటరుకు రూ.89.96గా ఉంది. ఘజియాబాద్‌లో లీటరు పెట్రోల్‌ను రూ.96.58, డీజిల్ ధర లీటర్‌కు రూ.89.75 వద్ద స్థిరంగా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.97.18, డీజిల్ ధర లీటరుకు రూ.90.05గా ఉంది.

 ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.94.27గా ఉంది.  కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర లీటరుకు రూ.94.24గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

పెట్రోల్ - డీజిల్ ధరలను ఎలా చెక్ చేయాలి?
 ప్రతిరోజూ పెట్రోల్ - డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇంకా ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

ఈ విధంగా మీరు నేటి ధరలను
మీరు SMS ద్వారా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్లు HPPrice అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది