Multibagger Stock: ఈ స్టాక్ లో 11 వేలు పెట్టుబడి పెట్టి ఉంటే రూ. 1 కోటి మీ సొంతం అయ్యేవి...ఎలాగో తెలుసుకోండి

By Krishna AdithyaFirst Published Sep 25, 2022, 5:09 PM IST
Highlights

స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమా అయితే,  చక్కటి ఫండమెంటల్స్ అలాగే చక్కటి వ్యాపార మోడల్ కలిగి ఉన్నా స్టాక్స్ మెరుగ్గా   రాణిస్తుంటాయి. అలాంటి  స్టాక్స్ గురించి మీరు వెతుకుతున్నట్లు అయితే ప్రస్తుతం ఒక గురించి తెలుసుకుందాం. కేవలం పదకొండు వేలు మాత్రమే పెట్టుబడి పెట్టి కోటి రూపాయలు సంపాదించుకున్న ఇన్వెస్టర్లు ఉన్నారు. ఆ స్టాక్  గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా గందరగోళం ఉంది. లక్షలాది మంది వాటాదారుల సంపద అవిరి అవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు షేర్‌హోల్డర్లు భయపడేందుకు ఇదే కారణం. కానీ ఈ స్టాక్ మార్కెట్ చాలా మందిని కోటీశ్వరులు చేసింది. ఈ రోజు మనం 11,000 రూపాయలను 1 కోటి రూపాయలకు మార్చిన అటువంటి స్టాక్ గురించి చెబుతాము.

సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగంలోని కంపెనీల భాగాలను తయారు చేస్తుంది. ఈ కంపెనీ తన వాటాదారులకు 1:2 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే ప్రతి 2 షేర్లకు, పెట్టుబడిదారులకు ఒక షేర్ బోనస్‌గా లభిస్తుంది. ఇందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అనుమతి కూడా ఇచ్చింది.

10 సంవత్సరాలలో ఆరవసారి బోనస్
ఈ కంపెనీ గత 10 ఏళ్లలో ఆరోసారి తన వాటాదారులకు బోనస్ షేర్లను ఇవ్వబోతోంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతిసారీ Samdrhana Motherson 1:2 నిష్పత్తిలో మాత్రమే వాటాదారులకు బోనస్ షేర్లను ఇచ్చింది. కంపెనీ ఇంతకు ముందు 2018, 2017, 2015, 2013 , 2012లో బోనస్ షేర్లను ఇచ్చింది.

పెట్టుబడిదారుల మూలధనంలో భారీ జంప్
సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్లు తమ ఇన్వెస్టర్లను విపరీతమైన రాబడిని ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మార్చాయి. ప్రస్తుతం NSEలో దీని ధర రూ.118.30గా ఉంది.  అయితే జనవరి 1, 1999న, కంపెనీ NSEలో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, దాని షేర్ల ధర రూ. 0.12. అంటే, అప్పటి నుంచి ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు రూ.98,483 కోట్ల రాబడిని ఇచ్చింది. అదే సమయంలో, అప్పుడు ఎవరైనా రూ.11,000 మాత్రమే పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు  రూ.1 లక్షా 8 కోట్లకు పెరిగి ఉండేది. అయితే గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 47 శాతం నష్టపోయింది. ఈ స్టాక్ 2021లో 52 వారాల గరిష్ట స్థాయి రూ.214కి చేరుకుంది.

సంస్థ , ఆర్థిక స్థితి
కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.54.97 వేల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.17615 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, లాభం రూ.141 కోట్లుగా ఉంది. అదే సమయంలో, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.16157 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, లాభం రూ.290 కోట్లుగా ఉంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ లాభం తగ్గింది.

click me!