Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్, ఒక్క రోజులోనే తులం బంగారం ఎంత పెరిగిందో తెలిస్తే షాకే..

By Krishna AdithyaFirst Published Sep 24, 2022, 10:03 AM IST
Highlights

బంగారు నగలు కొనేందుకు వెళ్తున్నారా, అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్ ఎందుకంటే, పసిడి ధర గత వారం రోజులుగా పెరుగతోంది. తాజాగా పసిడి ధర 10 గ్రాములకు గానూ, రూ.500 పెరిగింది. 

పండగల సీజన్ వచ్చేసింది. ముఖ్యంగా దసరా దీపావళి ధన త్రయోదశి వేడుకల నేపథ్యంలో ప్రజలు బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనడం తప్పనిసరిగా భావిస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. బంగారం గడచిన వారం రోజులుగా పెరుగుతూ వస్తోంది.

అయితే శుక్రవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 500 రూపాయలు పెరిగి, రూ.50,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ. 46,400 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం బంగారం ధరలు కొండెక్కాయి. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు గాను 500 రూపాయలు పెరిగి రూ. 50,750 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు గాను 500 రూపాయలు పెరిగి రూ.46,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం రూ.50,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది అలాగే ఆభరణాల బంగారం 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు గాను రూ. 46,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే భారీ తగ్గుదల గమనించవచ్చు శనివారం కిలో వెండి ధర 363 రూపాయలు తగ్గి రూ.58,300 వద్ద ట్రేడ్ అవుతోంది.

అయితే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని వెనక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వరుసగా కీలక వడ్డీ రేట్లు పెంచడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులు యూఎస్ బాండ్స్ వైపుకు తరలుతున్నాయి. డాలర్ పుంజుకోవడం ఇతర విదేశీ మారకద్రవ్యాలు సైతం నీరసపడటంతో పసిడి వైపు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు దేశీయంగా కూడా ఫెస్టివల్ సీజన్ కావడంతో పసిడి కొనుగోలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగడానికి దోహద పడింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిస్థితి కూడా పసిడి మార్కెట్ల వైపు తరలేందుకు దోహద పడింది.

ఇక గత రెండేళ్లుగా పసిడి ధర గరిష్ట స్థాయి నుంచి తగ్గుతూ వస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం బంగారం 24 క్యారెట్ల ధర ఏకంగా 10 గ్రాములకు గాను 56 వేల స్థాయికి దాటింది. అక్కడ నుంచి పసిడి పతనం అవుతూ రూ.50 వేల దిగువకు చేరింది. ప్రస్తుతం బంగారం రూ.50 వేల నుంచి రూ.51 వేల మధ్యలో కదలాడుతోంది. భవిష్యత్తులో బంగారం ధర రూ.52,000 మార్పును తాకవచ్చని బులియన్ పండితులు భావిస్తున్నారు.

click me!