ప్రపంచ కుబేరుల్లో మరో కోత్త రికార్డు.. టాప్-10లో ముకేశ్ అంబానీ..

By Sandra Ashok KumarFirst Published Jun 20, 2020, 10:40 AM IST
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా కుబేరుల్లో టాప్-10లో చేరారు. ఫోర్బ్స్ ప్రకటించిన రియల్ టైం కుబేరుల జాబితా ముకేశ్ అంబానీ నికర ఆస్థి 64.4 బిలియన్ డాలర్లు పెరిగింది.
 

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లో ఒకరిగా నిలిచారు.  ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ జాబితా ప్రకారం.. అంబానీ నికర ఆస్తి విలువ 64.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరోవైపు తమ సంస్థ రుణ రహిత సంస్థగా నిలిచిందని ముకేశ్ అంబానీ శుక్రవారం ప్రకటించారు. 

రిలయన్స్ ఇప్పుడు నికర రుణ రహిత సంస్థ అని ప్రకటించిన తరువాత దాని స్టాక్ ధర ధర శుక్రవారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 1738.95 డాలర్లను తాకింది. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీ నికర ఆస్తి విలువ 64.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. 

రిలయన్స్ అనుబంధ జియో ఫ్లాట్‌ఫామ్‌లోని 24.71 శాతం వాటాలను దాదాపు 12 మంది పెట్టుబడిదారులకు విక్రయించడం ద్వారా రూ .1.75 ట్రిలియన్ల నిధులను సమీకరించింది. రిలయన్స్ నికర రుణం 1.61 ట్రిలియన్లు ఉండేది.

also read సామాన్యుడిపై పెట్రోల్ పిడుగు... పట్టిపీడిస్తున్న ఇంధన ధరలు..

మరోవైపు, శుక్రవారం క్లోజింగ్ నాటికి ఆర్ఐఎల్ రూ. 11.52 లక్షల కోట్ల (150 బిలియన్ డాలర్లు) విలువైన తొలి ఇండియన్ కంపెనీగా రికార్డుకెక్కింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 160.4 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 109.9 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ 103.9 బిలయన్ల డాలర్లతో, మార్క్ జుకర్ బర్గ్ 87.8 బిలియన్ల డాలర్లతో, వారెన్ బఫెట్ 71.2 బిలియన్ల డాలర్లతో మైక్రో‌సాఫ్ట్‌కు చెందిన స్టీవ్ బాల్ట్‌మర్ 69.4 బిలియన్ డాలర్లతో తర్వాతీ స్థానాల్లో నిలిచారు.

సాఫ్ట్ వేర్ దిగ్గజం ల్యారీ ఎల్లిసన్ 67.9 బిలియన్ డాలర్లతో, జార్స్ అధినేత అమాంసియో ఒర్టెగా 65.8 బిలియన్ల డాలర్లతో తర్వాతీ స్థానాల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ 64.8 బిలియన్ నికర విలువతో ఆ తర్వాతీ స్థానంలో ఉండగా, 64.6 బిలియన్ డాలర్లతో అంబానీ ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.  

click me!