
గత కొంతకాలంగా దేశం అంతట వ్యాపార రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరు మొఘిపోతుంది. రిలయన్స్ జియోలో వాటాల అమ్మకాలు, పెట్టుబడులతో దూసుకెళ్లిపోతుంది. ఒక పక్క కరోనా సంక్షోభం దేశాన్ని ముంచేస్తుంటే మరోపక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం లాభాల బాటలో పరుగులు తీస్తుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ ధీరూభాయ్ అంబానీ 19 ఏప్రిల్ 1957లో జన్మించారు. భారతీయ బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్గా, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీలో ఒకటిగా నిలిచింది, మార్కెట్ విలువ ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన సంస్థ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఇందులో అతిపెద్ద వాటాదారుదూ. ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.
ముఖేష్ అంబానీ 19 ఏప్రిల్ 1957 న బ్రిటిష్ క్రౌన్ కాలనీలోని అడెన్ (ప్రస్తుత యెమెన్‌లో) ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించారు. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ, ఇద్దరు సోదరీమణులు నినా భద్రాష్యం కొఠారి, దీప్తి దత్తరాజ్ సల్గాకోకర్.
ముకేష్ అంబానీ యెమెన్‌లో కొద్దికాలం మాత్రమే నివసించారు, ఎందుకంటే అతని తండ్రి 1958లో సుగంధ ద్రవ్యాలు, వాణిజ్య వ్యాపారాన్ని ప్రారంభించటానికి భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నాడు.
also read హెచ్-1బీ వీసా నిషేధంపై సంచలనం :బాధితుల్లో ఇండియన్లే అత్యధికులు..
మొదట "విమల్" అని పేరు పెట్టారు, కాని తరువాత దీనిని "ఓన్లీ విమల్" గా మార్చారు. అతని కుటుంబం 1970 వరకు ముంబైలోని భులేశ్వర్ లోని రెండు పడక గదుల అపార్ట్మెంట్లో నివసించారు.
వారు భారతదేశానికి వచ్చాక కుటుంబ ఆర్థిక స్థితి కొద్దిగా మెరుగుపడింది. తరువాత కొలాబాలో 'సీ విండ్' అనే 14 అంతస్తుల అపార్ట్మెంట్ బ్లాక్ కొనుగోలు చేసి అక్కడ కొంత కాలం క్రితం వరకు అంబానీ, అతని సోదరుడు కుటుంసభ్యులతో నివసించారు.
గడిచిన పదేళ్ళ కాలంలో ముకేష్ అంబానీ సంపాదన రెండింతలు అయింది. 2010లో అతని సంపాదన 27 బిలియన్లు డాలర్లు ఉండగా ప్రస్తుతం అతని సంపాదన 60 బిలియన్ల డాలర్లు. అంబానీ ఇంటి విలువ సుమారు 1 బిలియన్ డాలర్లు. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీధైన ఇళ్ళలో ఒకటి.
భారతదేశంలో రెండో అతిపెద్ద ధనవంతుడి కంటే ముకేష్ అంబానీ ఆస్తి 4 రేట్లు ఎక్కువ. సంవత్సర ఆదాయం 26 లక్షల కోట్లు, నెలకు 7వేల 140 కోట్లు, వరనికి 238 కోట్లు , అంటే రోజుకి 34 కోట్లు. అంబానీ సంపాదన బేలరూస్ దేశ జిడిపి కంటే ఎక్కువ.
వరల్డ్ బ్యాంక్ డాటా ప్రకారం 2018లో బేలరూస్ జిడిపి 59.6 డాలర్లు. ఒక విధంగా చెప్పాలంటే ముకేష్ అంబానీ మొత్తం ఆస్తి విలువ ఆఫ్గనిస్తాన్, బోట్స్వానా, బోస్నియా, హెర్జెగోవినా దేశ జిడిపి తో సమానం.
.