మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్: 200 విమానాలు రద్దు

By Galam Venkata Rao  |  First Published Jul 19, 2024, 6:06 PM IST

మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ సమస్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌లైన్ సేవలు అంతరాయం ఏర్పడ్డాయి. ఇండియాలో ఇండిగో దాదాపు 200 విమానాలను రద్దు చేసింది. 


మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎఫెక్ట్ విమాన సర్వీసులపై పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ఎయిర్‌లైన్స్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి ఎదరుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్‌లోనూ విమాన సేవలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. 

కాగా, మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ సమస్య కారణంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఇండిగో భారతదేశం అంతటా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం కారణంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. ఫ్లైట్‌ రీబుక్ లేదా రీఫండ్‌ను క్లెయిమ్ చేసే ఆప్షన్‌ కూడా తాత్కాలికంగా అందుబాటులో లేదని తెలిపింది. రద్దయిన విమానాల వివరాలను తెలుసుకునేందుకు https//bit.ly/4d5dUcZ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.  

Latest Videos

undefined

ఇండిగో తన వెబ్‌సైట్‌లో విడుదల చేసిన సమాచారం ప్రకారం... ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నుండి దాదాపు 192 విమానాలు రద్దయ్యాయి. 

కాగా, మైక్రోసాఫ్ట్ అజూర్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌తో కొనసాగుతున్న సమస్య కారణంగా ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, విస్తారాతో సహా ప్రధాన భారతీయ విమానయాన సంస్థలు గణనీయమైన అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. పెరిగిన నిరీక్షణ సమయం, స్లో చెక్-ఇన్‌లు, విమానాశ్రయాలు, సంప్రదింపు కేంద్రాల వద్ద భారీ క్యూలతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

click me!