మాయా టాటా ఎవరు..? రతన్ టాటా స్థానంలోకి ఆమె వస్తారా..? టాటా వారసులు ఎవరంటే..?

Published : Mar 14, 2023, 02:55 PM IST
మాయా టాటా ఎవరు..?  రతన్ టాటా స్థానంలోకి  ఆమె వస్తారా..? టాటా వారసులు ఎవరంటే..?

సారాంశం

తాజాగా రతన్ టాటా కుటుంబంలోని ముగ్గురిని టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ సభ్యులుగా నియమించారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు వారసులు ఎవరన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురిలో ఒకరైన మాయా టాటా గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ మాయా టాటా ఎవరు? రతన్ టాటా స్థానంలో ఆయన వస్తారా?

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల తదుపరి వారసులు ఎవరు అనే ఆసక్తి చాలా మందికి ఉండోచ్చు. అయితే ఈ సంస్థలోనే టాటా సంస్థల భవిష్యత్తు సారథులు పనిచేస్తున్నారు. అవును, ఇది నిజం.. టాటా కుటుంబానికి చెందిన వారు సంస్థలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే, వారు బహిరంగంగా అప్పుడు కనిపించ లేదు. ఇటీవల టాటా కుటుంబానికి చెందిన ముగ్గురు వారసులను రతన్ టాటా టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్‌కు నియమించారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు వారసులు ఎవరన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. రతన్ టాటా నియమించిన ఈ ముగ్గురు కూడా తోబుట్టువులే. వారిలో రతన్ టాటా చిన్న వారసుల్లో ఒకరైన 34 ఏళ్ల మాయా టాటా కూడా ఉన్నారు. రతన్ టాటా మాయా, ఆమె సోదరి లియా, సోదరుడు నెవిల్లేలను బోర్డులో కొత్త సభ్యులుగా నియమించారు. అలాగే రతన్ టాటా దగ్గరే శిక్షణ పొందుతున్నారు. ఇంకా బిలియన్ డాలర్ల వ్యాపారానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంటే మాయ రతన్ టాటా వారసులా..? అనే చర్చ మొదలైంది. 

ఈ మాయ టాటా ఎవరు?
 నోయెల్ టాటా ముగ్గురు సంతానంలో మాయ చివరి సంతానం. సోదరి లేహ్, సోదరుడు నెవిల్లే, మాయ కూడా టాటా గ్రూప్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. మాయ బేయెస్ బిజినెస్ స్కూల్ అండ్ ఇంగ్లండ్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయంలో చదువుకుంది. ఆమె తల్లి పేరు అలో మిస్త్రీ. ఆమె టాటా గ్రూప్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ సోదరి, బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ కుమార్తె. 

టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో మాయ తన వృత్తిని ప్రారంభించింది. ఆమె ఈ సంస్థ మూసివేయబడే వరకు పనిచేశారు. ఈ సంస్థలో మాయ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఇన్వెస్టర్ సంబంధాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ మూసివేయబడిన తర్వాత, మాయ టీమ్‌లు మారి టాటా డిజిటల్‌లో చేరారు. ఆమె ఈ కంపెనీలో ఉండగానే 'టాటా నియో యాప్‌'ని ప్రారంభించారు.

మాయకి న్యూ ఏజ్ అనాలిటిక్స్ అండ్ టెక్నాలజి  పై ఎంతో ఆసక్తి ఉంది. మాయ ఎక్కువగా పబ్లిక్‌గా కనిపించకపోవడం, సోషల్ మీడియాలో  యాక్టివ్‌గా లేనందున ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ గవర్నింగ్ కౌన్సిల్‌లోని ఆరుగురు సభ్యులలో మాయ ఒకరు. ఈ ట్రస్ట్ కోల్‌కతాలో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. 2011లో రతన్ టాటా ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.
 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే