పాకిస్థాన్‌కు మరో దెబ్బ.. ఆర్థిక సంక్షోభం కారణంగా మూతపడిన హోండా కార్ యూనిట్!

By asianet news teluguFirst Published Mar 14, 2023, 1:46 PM IST
Highlights

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే  ఆర్థిక దెబ్బ తట్టుకోలేక హోండా కార్ యూనిట్ పాకిస్థాన్ లో మూతపడింది. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో  కంపెనీ సప్లయ్ చైన్ పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కార్ల విక్రయాలు కూడా  పడిపోయాయి. 

పాకిస్థాన్ క్షణక్షణం పాతాళంలోకి పడిపోతోంది. ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు మూతపడ్డాయి. తాజాగా వాహన తయారీ సంస్థ హోండా కంపెనీ  దాని పాకిస్థాన్ కార్ యూనిట్‌ను మూసివేసింది. సప్లయ్ చైన్ పై తీవ్ర ప్రభావం చూపడంతో యూనిట్‌ను మూసివేస్తున్నట్లు హోండా స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చడంతో  కంపెనీ సప్లయ్ చైన్ పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కార్ల విక్రయాలు పడిపోయాయి. ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం సాధ్యం కాకుండా పోయింది. సప్లయ్ చైన్ పై ప్రభావం కారణంగా మార్చిలో హోండా కార్ యూనిట్ పూర్తిగా మూసివేసింది. ఈ నెలాఖరులో పాకిస్థాన్‌లో పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని హోండా అట్లాస్ కారు తెలిపింది.

ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం పలు వస్తువుల దిగుమతిపై ఆంక్షలు విధించింది. నిత్యావసర వస్తువులు కాకుండా ఇతర వస్తువులపై నియంత్రణ ఉంటుంది. అందువల్ల హోండా కార్ యూనిట్ ముడి పదార్థాలను దిగుమతి చేసుకోలేకపోయింది. దీంతో కంపెనీ  కార్లకు డిమాండ్‌ లేకుండా పోయింది. అందువల్ల సప్లయ్ చైన్ లో అంతరాయం ఏర్పడిందని హోండా తెలిపింది.

పాకిస్థాన్ రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణం, దిగుమతుల ధరల పెరుగుదల పాకిస్థాన్ కష్టాలను రోజురోజుకు మరింత దిగజార్చాయి. దీంతో పాకిస్థాన్ ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. చాలా కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని నిలిపివేశాయి. ఆటోమొబైల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఆకలితో అలమటిస్తున్న పాకిస్థాన్ ప్రజలు కార్లు, వాహనాలు కొనాలనే ఆలోచన చేయడం లేదు. మరోవైపు వాహనం ధరలు కూడా ఖరీదైనవిగా మారాయి.

టయోటా మోటార్స్, పాక్ సుజుకీ మోటార్స్ ఇప్పటికే చాలాసార్లు ఉత్పత్తిని నిలిపివేశాయి. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే టయోటా మోటార్స్, పాకిస్థాన్ సుజుకీలు కూడా ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉంది.

click me!