ఒకప్పుడు పెద్ద పెద్ద ఆశయాలతో హోటల్ వెయిటర్‌గా పనిచేసిన వ్యక్తి నేడు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా మారాడు.
ఒకప్పుడు పెద్ద పెద్ద ఆశయాలతో హోటల్ వెయిటర్‌గా పనిచేసిన వ్యక్తి నేడు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా మారాడు. అతను ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలలో ఒకదాన్ని కూడా నడుపుతున్నారు. అతను మరెవరో కాదు, పబ్లిక్ ట్రేడెడ్ కంపెని ఎన్విడియా ఫౌండర్ అండ్ CEO జెన్సన్ హువాంగ్.
జెన్సన్ హువాంగ్ ఇప్పుడు ప్రపంచంలోని 11వ అత్యంత ధనవంతుడు, తాజాగా అతని మొత్తం ఆస్తి విలువ $4 బిలియన్లకు పైగా పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల లిస్టులో 11వ స్థానం అనేది అతని అత్యున్నత ర్యాంక్. దీంతో అతనిప్పుడు ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, భారతీయ బిలియనీర్ రతన్ టాటా కంటే ముందున్నాడు.
undefined
మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీలను అధిగమించి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడ్ కంపెనీగా అవతరించింది. కంపెనీ షేర్లు 3.4 శాతం పెరిగాయి, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు $3.3 ట్రిలియన్లు. Nvidia వాల్ స్ట్రీట్‌లో అత్యధికంగా ట్రేడ్ అయిన కంపెనీగా కూడా అవతరించింది. యావరేజ్ డైలీ టర్నోవర్ $50 బిలియన్లు. Apple, Microsoft ఇంకా Tesla డైలీ సేల్స్ కంటే $10బిలియన్లతో ముందుంది.
ఎవరు ఈ జెన్సన్ హువాంగ్ ?
జెన్సన్ హువాంగ్ 1963లో తైవాన్‌లోని తైనన్ సిటీలో జన్మించాడు. ఆయనకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని కుటుంబం థాయిలాండ్‌కు మారింది. 9 సంవత్సరాల వయస్సులో, అతను తన సోదరుడితో కలిసి వాషింగ్టన్‌లోని టాకోమా(tacoma)లో ఉన్న తన మేనమామ ఇంటికి మారాడు. అతను కెంటుకీ(Kentucky)లోని ఒనిడా(oneida)లో ఒనిడా ఎలిమెంటరీ స్కూల్‌లో స్కూలింగ్ పూర్తి చేశాడు. తరువాత పోర్ట్‌ల్యాండ్ సమీపంలోని అలోహా హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. యవ్వనంలో ఉన్నప్పుడు హువాంగ్ డెన్నీ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిచేశాడు.
1993లో హువాంగ్ క్రిస్ మలాచోస్కీ అండ్ కర్టిస్ బ్రీమ్‌తో కలిసి ఎన్విడియాను స్థాపించాడు. 2007లో అతను యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక వేతనం పొందుతున్న 61వ CEO అయ్యాడు. అప్పట్లోనే 24.6 మిలియన్ డాలర్ల వేతనం అందుకోవడం గమనార్హం.