మీ బ్యాంకు అకౌంట్లో రూ.2000 పడ్డాయా.. 17వ విడత విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఎప్పుడో తెలుసా?

By Ashok kumar Sandra  |  First Published Jun 18, 2024, 7:04 PM IST

కేంద్ర పథకం పిఎం కిసాన్ యోజన కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది, ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. 


ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నీతి యోజన కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా ఒక్కొక్కరికి ఏడాదిలో మూడు సమాన వాయిదాలలో రూ.2,000 ద్వారా మొత్తం రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది . ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నీతి యజన లబ్ధిదారులకు ఒక శుభవార్త. ఈ పథకం 17వ విడతను ఇవాళ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో రైతులకు విడుదల  చేయనున్నారు. వారణాసిలో ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు విడతల వారీగా రూ.20 వేల కోట్లు ఇవ్వనున్నారు.

కేంద్ర పథకం పిఎం కిసాన్ యోజన కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది, ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు తాజా 17వ విడత ద్వారా రూ.20,000 కోట్లు అందనున్నాయి. ఈ పథకంలో 2 కోట్ల మందికి పైగా రైతులు కిసాన్ సమ్మేళనలో  చేరాలని భావిస్తున్నారు.

Latest Videos

17వ విడత స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ?

ముందుగా pmkisan.gov.inకు లాగిన్ చేయండి. హోమ్ పేజీలో హోమ్ పేజీలోని 'ఫార్మర్స్ కార్నర్' విభాగంలో 'యూజర్ లెవెల్' అప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఎంటర్  చేయండి. ఇప్పుడు పేజీలో వాయిదా స్టేటస్  చూపించడానికి 'Get Data'పై క్లిక్ చేయండి. 

ప్రధాన మంత్రి కిసాన్ యోజన: 17వ టర్మ్‌కు ఎవరు అర్హులు 
సొంతంగా భూమి ఉండి స్వయంగా సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలన్నీ ఈ కేంద్ర పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు.

మొదట pmkisan.gov.inలో అధికారిక PM-కిసాన్ పోర్టల్‌కి లాగిన్ చేయండి. ఆపై పేజీలో, 'ఫార్మర్స్ కార్నర్' విభాగాన్ని చెక్  చేయండి. ఈ పేజీలో, 'యూజర్ స్టేటస్' అప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ, మీరు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్  నంబర్ లేదా మొబైల్ నంబర్ వంటి అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి. ఆపై 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేయండి. ఆ తర్వాత, మీ అప్లికేషన్ ప్రస్తుత స్టేటస్ అండ్  వివరాలు  చూపిస్తాయి.

click me!