చిన్న పరిశ్రమల కోసం మాస్టర్‌కార్డ్‌ రూ.250 కోట్ల సాయం..

By Sandra Ashok KumarFirst Published Jul 11, 2020, 10:37 AM IST
Highlights

భారత్​లో చిన్న, మధ్య తరహా సంస్థలకు సాయం చేసేందుకు మరోసారి అంతర్జాతీయ డిజిటల్ లావాదేవీల నిర్వహణ సంస్థ మాస్టర్​కార్డ్ ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రధానంగా మహిళా ఔత్సాహికవేత్తల ప్రోత్సాహానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు ప్రకటించింది.
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో తలెత్తిన సంక్షోభంలో చిక్కుకున్న దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు సాయం చేసేందుకు అంతర్జాతీయంగా చెల్లింపుల సేవలు అందించే సాంకేతిక దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ మరోసారి ముందుకు వచ్చింది. ఆయా సంస్థలకు సాయం చేయడానికి మరో రూ.250 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది.

2025 వరకు భారత్‌లో 100 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెడతామన్న గత నిర్ణయానికి అదనంగా మాస్టర్ కార్డ్ ఈ సాయం ప్రకటించింది. చిన్న వాణిజ్య సంస్థల డిజిటలీకరణకు, ఆయా సంస్థలు రుణాలు సులభతరంగా పొందేలా సాయం చేసేందుకు, మహిళా ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.250 కోట్లు వినియోగిస్తామని మాస్టర్‌కార్డ్‌ దక్షిణాసియా అధిపతి పోరష్‌ సింగ్‌ తెలిపారు.

కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా సంస్థ వెచ్చించనున్న సుమారు రూ.1875 కోట్ల (250 మిలియన్‌ డాలర్లు) సాయంలో భాగంగా ఈ నిధులు భారత్‌కు కేటాయించామని మాస్టర్‌కార్డ్‌ దక్షిణాసియా అధిపతి పోరష్‌ సింగ్‌ పేర్కొన్నారు. 

also read 

కోటి మంది వ్యాపారులు డిజిటల్‌ పద్ధతిలో నగదు స్వీకరించేలా చేయడమే తమ సంస్థ లక్ష్యమని మాస్టర్‌కార్డ్‌ దక్షిణాసియా అధిపతి పోరష్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దుకాణదారులు, బ్రాండ్లతో ఒప్పందం చేసుకునేలా చేస్తామని, ఇందువల్ల పారదర్శక అమ్మకాలు పెరిగి, ఆర్థిక సంస్థలకు సదరు వ్యాపారాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇందువల్ల రుణాలు మంజూరు చేయడం సులభమవుతుందని పేర్కొన్నారు.

గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి 19 యాప్స్ తొలగింపు
వినియోగదారులకు భద్రతా పరంగా మరింత మెరుగైన సేవలను అందించడానికి సెర్చింజన్ ‘గూగుల్’ అనుబంధ ప్లే స్టోర్ 11 యాప్స్ తొలగించి వేసింది. సదరు యాప్స్‌ల్లో ‘జోకర్ మాల్వేర్’ అనే వైరస్‌ను గర్తించి చర్యలు తీసుకున్నట్లు ‘చెక్ పాయింట్’ అనే సెక్యూరిటీ పొల్యూషన్స్ సంస్థ తెలిపింది. వినియోగదరులు వీటిని తమ మొబైల్ ఫోన్లలో యాప్స్ తొలగించాలని సూచించినట్లు తెలుస్తోంది. 

ఈ యాప్స్ ద్వారా మాల్వేర్ ఫోన్ లోకి ప్రవేశించి వినియోగదారుల ప్రమోయేం లేకుండానేనే ప్రీమియం సర్వీసులను సబ్ స్క్రైబ్ చేసుకోగలమని గూగుల్ తెలిపింది. ఈ విషయాన్నిగూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్ కూడా గుర్తించలేదని పేర్కొంది. వినియోగదారుల డేటాకు భంగం కలిగించే యాప్స్‌ను గుర్తించి వాటిని తరుచుగా తొలగిస్తూ ఉంటుంది.

click me!