
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మొబైల్ అప్లికేషన్ YONO వినియోగదారులు విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. చాలా మంది వినియోగదారులు ఈ సమస్య గురించి ట్విట్టర్ ద్వారా బ్యాంకు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సాంకేతిక సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని SBI ఒక ప్రకటనలో బ్యాంకు కస్టమర్లకు తెలిపింది.
వాస్తవానికి, Yono వినియోగదారులు వారి ఫోన్‌లలో తప్పుడు నోటిఫికేషన్‌లను పొందుతున్నారు. ఈ విషయమై చాలా మంది SBI Yono వినియోగదారులు తమ ఫిర్యాదులను ట్విట్టర్‌లో పంచుకోవడం ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ట్విట్టర్ వినియోగదారు ఇలా వ్రాశాడు, 'యోనో SBI యాప్ ద్వారా నాకు లోన్ ఇస్తామంటు మెసేజ్ లతో స్పామ్ చేస్తోంది. దయచేసి దీనిని పరిశీలించండి. ఇందులో ఏదో తప్పు జరుగుతోంది." అని తెలియ జేశాడు. అలాగే మరికొందరు వినియోగదారులు కూడా వేర్వేరు పేర్లతో నోటిఫికేషన్‌లను పొందుతున్నామని ట్వీట్ ద్వారా తెలియజేశారు.
మరొక వినియోగదారు SBI అధికారిక హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి, "Yono Lite నుంచి రకరకాల పేర్లతో SBI తక్షణ వ్యక్తిగత రుణం ఇస్తామంటూ నోటిఫికేషన్‌లతో స్పామ్ చేస్తోంది. దయచేసి దీనిని పరిశీలించండి." అని ట్వీట్ చేశారు.
త్వరలో సమస్య పరిష్కారానికి ప్రయత్నం...
అనేక ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత, SBI ఒక ప్రకటన విడుదల చేసింది, “సాంకేతిక లోపం కారణంగా, కొంతమంది వినియోగదారులు Yono Lite అప్లికేషన్‌లో తప్పుడు నోటిఫికేషన్ సందేశాలను అందుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాము. ” అని విడుదల చేసింది.
త్వరలోనే SBI YONO ఇకపై Only YONOగా అప్ డేట్..
ఇదిలా ఉంటే SBI గురువారం తన బ్యాంకింగ్ యాప్ యోనోను అప్ డేట్ చేయడం ద్వారా పూర్తి డిజిటల్ బ్యాంక్‌ను ప్రారంభించే ప్రణాళికను ప్రకటించింది. భవిష్యత్తులో YONO యాప్ సేవలను మరింత మెరుగు పరిచి 'ఓన్లీ యోనో'గా (Only YONO) మార్చనుంది.
ఇప్పటికే ఉన్న YONO కస్టమర్‌లను మాత్రమే సరికొత్త Only YONOకి తరలించడంతోపాటు, తదుపరి 12-18 నెలల్లో అప్‌డేట్‌ను అందించాలని బ్యాంక్ యోచిస్తోంది. 2017లో ప్రారంభించబడిన SBI YONO మార్చి 31, 2021 నాటికి 70.5 మిలియన్ డౌన్‌లోడ్‌లను అధిగమించింది. అలాగే 37.09 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది.
బ్యాంక్ తన కొత్త ప్లాన్‌ను పంచుకుంటూ, “Only YONO ద్వారా తరువాతి తరం కస్టమర్ల కోసం మాడ్యులర్ ఆర్కిటెక్చర్, మరింత పర్సనలైజ్డ్ కస్టమర్-సెంట్రిక్ డిజైన్‌తో పూర్తి డిజిటల్ బ్యాంక్‌ను ప్రారంభించేందుకు ఈ కొత్త అప్ డేట్ ను SBIని సిద్ధం చేస్తుందని తెలిపింది. యాప్ వాడుకలో మరింత సౌలభ్యం, కస్టమర్ అనుభవాలను ఫీడ్ బ్యాక్ గా అందుకొని ఈ ప్రయత్నం చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ప్రాజెక్ట్ ప్లాన్‌ను రూపొందించడంలో సహాయం చేయడానికి ఒక కన్సల్టెంట్‌ను తీసుకోనున్నట్లు తెలిపింది.
2017లోనూ బ్యాంక్ యోనోను పూర్తిగా ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చాలని ఆలోచించింది. ఈ యాప్ వాల్యుయేషన్‌లో 40 బిలియన్ డాలర్లు ఎస్‌బిఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. YONO యాప్ స్ట్రీమ్ లెస్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. యాప్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌గా కూడా పనిచేస్తుంది.