Stock Market: 5 రోజుల ర్యాలీకి ముగింపు, నష్టాల్లో ముగిసిన 709 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Published : Mar 15, 2022, 04:47 PM IST
Stock Market: 5 రోజుల ర్యాలీకి ముగింపు, నష్టాల్లో ముగిసిన 709 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

సారాంశం

Stock Market: వరుసగా 5 రోజుల లాభాల తర్వాత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నెగిటివ్ గా ముగిశాయి. మార్కెట్ సెంటిమెంటును రష్యాపై విధించిన వాణిజ్య ఆంక్షలు దెబ్బతీశాయి. దీంతో   మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, IT స్టాక్స్ భారీగా నష్టపోయాయి. 

Stock Market: వరుసగా 5 రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది.  మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, IT స్టాక్‌లలో అమ్మకాల కారణంగా నిఫ్టీ 16700 దిగువన ముగియడంతో బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నెగిటివ్ గా ముగిశాయి. 

ముగింపులో, సెన్సెక్స్ 709.17 పాయింట్ల నష్టంతో 1.26% క్షీణించి 55,776.85 వద్ద, నిఫ్టీ 208.30 పాయింట్ల నష్టంతో  1.23% క్షీణించి 16,663 వద్ద మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. దాదాపు 1296 షేర్లు పాజిటివ్ గా ట్రేడవగా, 2014 షేర్లు క్షీణించాయి, 95 షేర్లు మారలేదు.

హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ నిఫ్టీ లూజర్లుగా ఉన్నాయి.  టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎం అండ్ ఎం, సిప్లా, శ్రీ సిమెంట్స్, మారుతీ సుజుకీ లాభపడ్డాయి.

సెక్టార్లలో, ఆటో తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు ఐటి, మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1-4 శాతం క్షీణించడంతో నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి.

జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, గ్యాస్ దిగుమతుల సస్పెన్షన్‌తో పాటు రష్యాపై కొత్త ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ లు రికవరీ అయ్యే అవకాశం కోల్పోయాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సంధి వస్తుందని ఊహించి మెరుగవుతున్న మార్కెట్ సెంటిమెంట్‌కు ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. 

అలాగే కమోడిటీ ధరల్లో తగ్గుదల కారణంగా భారత మార్కెట్ మెరుగైన పనితీరు కనబరిచింది. మార్కెట్లు ఎదురుచూస్తున్న US ఫెడ్ సమావేశానికి ముందు ప్రపంచ మార్కెట్లు డౌన్ ట్రెండ్ లో సాగుతున్నాయి. 

Hem Securities కు చెందిన  Mohit Nigam మాట్లాడుతూ,  నిఫ్టీ  సూచీ 16663 వద్ద, సెన్సెక్స్ 55777 వద్ద ముగియడంతో బెంచ్‌మార్క్ సూచీల ర్యాలీకి బ్రేక్ పడింది.  ప్రపంచ మార్కెట్ ప్రతికూల  సూచనల మధ్య పెట్టుబడిదారుల సెంటిమెంట్‌లు దెబ్బతిన్నాయి. చైనాలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు లాక్‌డౌన్‌ల వార్తలు సైతం మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలను పంపాయి. ఇదిలా ఉంటే, US ఫెడరల్ బ్యాంక్ ఈరోజు నుండి రెండు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం పరిస్థితిని అరికట్టేందుకు వడ్డీ రేట్లలో 25bps పెంపుదల ఉంటుందని సాధారణ మార్కెట్ సెంటిమెంట్లు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు రూపీ-రూబుల్ వాణిజ్యాన్ని సులభతరం చేయడం ద్వారా రష్యా ముడి చమురును డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయాలని భారతదేశం ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను కూడా పెట్టుబడిదారులు గమనించారు. 

నిఫ్టీ50కి టెక్నికల్ ఫ్రంట్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ 17,000 మరియు డౌన్‌సైడ్‌లో 16,600 బలమైన మద్దతుగా పని చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి కీలక నిరోధం స్థాయి 35,700,  దిగువన 34,000 బలమైన మద్దతుగా పని చేస్తుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మ‌తిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బ‌లాదూర్ అంటారు
Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం