Closing Bell: మంగళవారం కూడా మారని మార్కెట్ నెగిటివ్ మూడ్, వరుసగా నాలుగో సెషన్ లో నష్టాలు, పతనంలో అదానీ షేర్లు

Published : Mar 14, 2023, 03:45 PM IST
Closing Bell: మంగళవారం కూడా మారని మార్కెట్ నెగిటివ్ మూడ్, వరుసగా నాలుగో సెషన్ లో నష్టాలు, పతనంలో అదానీ షేర్లు

సారాంశం

వరుసగా నాలుగో సెషన్ లో కూడా  స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 337.66 పాయింట్లు క్షీణించి 57,900.19 వద్ద, నిఫ్టీ 111.00 పాయింట్లు  క్షీణించి 17,043.30 వద్ద సెటిల్ అయ్యాయి. 

ఈ వారం వరుసగా రెండో సెషన్ మంగళవారం కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ -337.66 పాయింట్లు నష్టపోయి 57,900.19 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ సూచీ 111.00 పాయింట్లు నష్టపోయి 17,043.30 పాయింట్ల వద్ద ముగిసింది.  టాప్ లూజర్లుగా  Adani Enterprises , Adani Ports & Speci, Mahi. & Mahi, Tata Consultancy, HDFC Life Insurance, Bajaj Finance,  Kotak Mahindra Bank నిలిచాయి. 

సెక్టార్ల పరంగా చూసినట్లయితే నిఫ్టీ 50 ప్రధాన సూచీలోని మార్కెట్ క్యాప్ పరంగా వెయిటేజీ ఉన్న షేర్లన్నీ కూడా నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా మార్కెట్ క్యాప్ పరంగా బలమైన వెయిటేజీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,276.55 వద్ద ట్రేడవుతూ 0.35 శాతం నష్టపోయింది. ఇక మరో భారీ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ టీసీఎస్ ఈ రోజు మార్కెట్ గాలిని తీసేసింది. టీసీఎస్ ఈ రోజు ట్రేడింగ్ లో 2 శాతం పైన నష్టపోయింది. అలాగే మార్కెట్ క్యాప్ పరంగా బలమైన స్టాక్స్ అయిన HDFC 0.57 శాతం, HDFC Bank 0.18 శాతం నష్టపోయాయి. ఇక SBI 0.76 శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్ 1 శాతం, ఐటీసీ 1 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ 50 సూచీలో టైటాన్, బీపీసీఎల్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ అండ్ టీ  మినహా దాదాపు అన్ని స్టాక్స్ నెగిటివ్ గా ముగిశాయి. 

బ్యాంక్ నిఫ్టీ సూచీ విషయానికి వస్తే 0.4 శాతం నష్టపోయింది. ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకు మినహా అన్ని బ్యాంకుల నష్టాల్లో ముగిశాయి. SBI 0.90 శాతం నష్టపోగా, కోటక్ మహీంద్రా బ్యాంకు అత్యధికంగా 1.64 శాతం నష్టపోయింది. అలాగే బంధన్ బ్యాంకు 5.64 శాతం నష్టపోయింది.

ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఈ రోజు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీలోని కంపెనీలు అన్నీ నష్టాల్లో ముగిశాయి. ప్రధాన ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్ 2 శాతం నష్టపోగా, టెక్ మహీంద్రా 1.56 శాతం, ఇన్ఫోసిస్ 0.90 శాతం, HCL టెక్నాలజీస్ 1 శాతం, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. 

ఆటో స్టాక్స్ కూగా భారీగా నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 2.86 శాతం నష్టపోయింది. అలాగే టాటా మోటార్స్ 1.18 శాతం నష్టపోయింది. అశోక్ లేల్యాండ్, 1.74 శాతం, మూరుతి 0.10 శాతం చొప్పున నష్టపోయాయి.  నిఫ్టీ మెటల్స్ సూచీ విషయానికి వస్తే అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ఏకంగా 7.76 శాతం నష్టపోయింది. అలాగే హిందుస్తాన్ జింక్ 1.65 శాతం నష్టపోయింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే