ఇంట్లో నెయ్యి తయారీతో రూ. వేలలో ఆదాయం.. నష్టం లేని వ్యాపారం

By Narender Vaitla  |  First Published Dec 27, 2024, 1:26 PM IST

వ్యాపారం చేయాలనే ఆలోచన దాదాపు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు ఆర్జించే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. అయితే చాలా మంది సరైన అవగాహన లేక వ్యాపారాల్లో నష్టాలు చవి చూస్తుంటారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా బిజినెస్‌ మొదలు పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


ప్రస్తుతం మార్కెట్లో అంతా కల్తీమయమవుతోంది. ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. కాసుల కక్కుర్తి కోసం తినే వస్తువులను కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా సరే తమ జేబులు నిండితే చాలనే భావనలో ఉంటున్నారు. అయితే ఇలాంటి సమయాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా కల్తీలేని వస్తువులను తయారు చేస్తే ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవచ్చు. ప్రజలకు మంచి నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించడంతో పాటు, లాభాలు సైతం ఆర్జించవచ్చు.

నెయ్యి తయారీ.. 

ఇంట్లో కచ్చితంగా ఉండే ఆహార పదార్థాల్లో నెయ్యి ఒకటి. చాలా మంది నెయ్యి లేకపోతే ముద్ద దిగని పరిస్థితి ఉంటుంది. నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. మరీ ముఖ్యంగా చిన్నారులకు కచ్చితంగా నెయ్యిని తినిపిస్తుంటారు. ఇలాంటి నెయ్యిని కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. అయితే స్వచ్ఛమైన నెయ్యికి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన మంచి నెయ్యికి మొగ్గు చూపుతున్నారు. ఈ నెయ్యి తయారీని ప్రారంభిస్తే లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంతకీ నెయ్యి తయారీకి ఎంత ఖర్చవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయంటే. 

కావాల్సినవి.. 

Latest Videos

undefined

నెయ్యి తయారీకి క్రీమ్‌ సెపరేట్‌ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మిషిన్స్‌ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెండు రకాలు ఉంటాయి. హ్యాండ్‌ ఆపరేటింగ్‌, మోటర్‌ మిషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఈ మిషిన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. నెయ్యి తయారీకి కావాల్సిన మరో ప్రధాన రా మెటీరియల్ పాలు ఫ్యాట్‌ శాతం ఎక్కువగా ఉండే పాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పాల కేంద్రాలను లేదా నేరుగా పాడి రైతుల నుంచి సేకరించవవచ్చు. 

ఎలా తయారు చేస్తారు.? 

నెయ్యి తయారీ కోసం ముందుగా పాలను తీసుకొని క్రీమ్‌ సెపరేట్ మిషిన్‌లో పోయాలి. మిషిన్‌ ఆన్‌ చేసిన వెంటనే ఒకవైపు నుంచి పాలు, మరో వైపు నుంచి క్రీమ్‌ వస్తుంది. ఈ క్రీమ్‌తోనే నెయ్యిని తయారు చేస్తారు. పాల నుంచి సేకరించిన క్రీమును వేడి చేస్తే సరిపోతుంది. నెయ్యి రడీ అయినట్లే. ఈ నెయ్యిని మీరు స్వయంగా ప్యాకెట్ల రూపంలో ప్యాక్‌ చేసి విక్రయించుకోవచ్చు. ఇకపోతే క్రీము తీసిన తర్వాత మిగిలిన పాలను టీ దుకాణాల్లో విక్రయించుకోవచ్చు. 

లాభాలు ఎలా ఉంటాయంటే.. 

లాభాల విషయానికొస్తే.. ఒక కేజీ నెయ్యిని తయారు చేయడానికి సుమారు 20 లీటర్ల పాలు అవసరమవుతాయి. ఉదాహరణకు 100 లీటర్ల పాలు తీసుకుంటే దాంతో 5 కిలోల నెయ్యి తయారు చేయొచ్చు. అలాగే 80 లీటర్ల పాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నెయ్యి ధర సుమారు రూ. 600 పలుకుతోంది ఈ లెక్కన 100 లీటర్ల పాలతో తయారు చేసిన నెయ్యితో రూ. 3000 వరకు లాభాలు ఆర్జించవచ్చు. అలాగే మిగిలిన పాలను కనీసం లీటరకు రూ. 40 చొప్పున అమ్మినా రూ. 3200 లాభం వస్తుంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో సరాసరి రూ. 6000 వరకు లాభం పొందొచ్చు. 
 

click me!