అమెరికాలో మరో అతిపెద్ద సైబర్ దాడి, ఒకేసారి అన్నీ కంప్యూటర్లు హ్యాక్..

By Sandra Ashok KumarFirst Published Sep 29, 2020, 5:41 PM IST
Highlights

తాజాగా యు.ఎస్ లోని ఒక యూనివర్సల్ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్స్  సోమవారం సైబర్  హ్యాక్ వల్ల కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. ఒకేసారి కంప్యూటర్లు  హ్యాక్ అవడంతో వైద్యులు, నర్సులందరూ ఆన్‌లైన్‌లో కాకుండా ప్రతి పనికి పేపర్, పెన్ ఉపయోగించాల్సి వచ్చింది.

గతంలో జరిగిన అతి పెద్ద సైబర్ దాడి రాన్సమ్‌వేర్ ఆటాక్ తరువాత, తాజాగా యు.ఎస్ లోని ఒక యూనివర్సల్ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్స్  సోమవారం సైబర్  హ్యాక్ వల్ల కంప్యూటర్లు దెబ్బతిన్నాయి.

ఒకేసారి కంప్యూటర్లు  హ్యాక్ అవడంతో వైద్యులు, నర్సులందరూ ఆన్‌లైన్‌లో కాకుండా ప్రతి పనికి పేపర్, పెన్ ఉపయోగించాల్సి వచ్చింది. యూనివర్సల్ హెల్త్ సర్వీసెస్ ఇంక్. లో 250కి పైగా ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

మా హాస్పిటల్స్  నెట్‌వర్క్ కంప్యూటర్లు మొత్తం ఆఫ్‌లైన్‌లో ఉన్నాయని వైద్యులు, నర్సులు పేపర్, పెన్ సహా ఇతర వనరులను ఉపయోగిస్తున్నారని, అయితే ప్రస్తుతం కంప్యూటర్లు దెబ్బతిన్నాయి, ఇది సైబర్ దాడి లేదా ఇతర సమస్య పై స్పష్టత లేదు. మాకు  హ్యాకర్ల డిమాండ్ వంటి గురించి సమాచారం లేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

also read 

  'ఫార్చ్యూన్ 500' సంస్థ రోగుల చికిత్స కొనసాగుతోందని తెలిపింది. హాస్పిటల్ పేషెంట్ సమాచారం దుర్వినియోగం అయినట్లు ఎలాంటి సూచనలు లేవు. మా సంస్థలో సుమారు 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 'అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్' సీనియర్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ జాన్ రిగ్గి ఈ సైబర్ దాడిని'"రాన్సమ్‌వేర్ ఆటాక్" కావొచ్చు అని అన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో నేరస్థులు ఆరోగ్య సంరక్షణ సంస్థల నెట్‌వర్క్‌ను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 'రాన్సమ్‌వేర్' అనేది ఒక రకమైన సాఫ్ట్‌వేర్, దీని ద్వారా హ్యాకర్లు డేటాను దొంగిలించి తిరిగి ఇవ్వడానికి డబ్బు అడుగుతారు.

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ 'అమిసాఫ్ట్' సమాచారం ప్రకారం, .యుఎస్‌లో 764 హెల్త్‌కేర్ ప్రొవైడర్లు గత ఏడాది 'రాన్సమ్‌వేర్ ' ఆటాక్  వల్ల దెబ్బతిన్నాయి.

 

click me!