కరోనాపై పోరాటం: రోజుకు 10వేల ఫేస్ మాస్కులు తయారు చేయనున్న మహీంద్రా

By Sandra Ashok KumarFirst Published Apr 4, 2020, 7:11 PM IST
Highlights

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా ఫేస్ మాస్క్‌లు తయారు చేయాలనుకునే ఎవరికైనా సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహీంద్రా కంపెనీ యాజమాన్యం తెలిపింది.

కరోనావైరస్ పై పోరాటం చేసేందుకు ఫేస్ మాస్క్‌లు తయారు చేయడంలో ముంబైకి చెందిన స్టార్ట్-అప్‌ కంపెనీకి మహీంద్రా కంపెనీ సహాయపడనుంది, ఈ కంపెనీ ముంబై ప్లాంట్‌లో శుక్రవారం నుండీ మాస్కుల ఉత్పత్తి ప్రారంభించనుంది.

కరోనావైరస్ మహమ్మారిని ఎదురుకొనేందుకు ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా పోరాటం చేయనుంది.ఈ సంస్థ ఇప్పటికే వెంటిలేటర్లు, ఫేస్ షీల్డ్స్ తయారీకి కృషి చేస్తోంది.

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా ఫేస్ మాస్క్‌లు తయారు చేయాలనుకునే ఎవరికైనా సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహీంద్రా కంపెనీ యాజమాన్యం తెలిపింది.

ముంబైకి చెందిన స్టార్ట్-అప్ కంపెనీ చొరవపై స్పందిస్తూ, శానిటరీ న్యాప్‌కిన్లు, 3-ప్లై మాస్క్‌లను తయారు చేయడానికి తమ యంత్రాలను సవరించాలని మహీంద్రా కోరారు.కేవలం 4 రోజుల్లో మహీంద్రా కంపెనీ ఇంజనీర్లు ఈ పిలుపుకు స్పందించి ముంబైలోని మహీంద్రా కండివాలి ప్లాంట్ లోపల తయారీని ఏర్పాటు చేశారు.

also read దేశవ్యాప్తంగా లాక్​డౌన్:​ ఇల్లు కదలని ఇండియన్లు...సొంతూళ్లకు హైదరాబాదిలు

మహీంద్రా ఆటో ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును ఆనంద్ మహీంద్రా గురువారం ప్రారంభించారు. మహీంద్రా, మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోయెంకా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు.

ఈ 3-ప్లై మాస్క్‌ల తయారీ శుక్రవారం ప్రారంభమవుతుందని, పది రోజుల్లో రోజుకు 10 వేల మాస్కూలు తయారు చేసేలా ఉత్పత్తిని ర్యాంప్ చేస్తామని ఆయన చెప్పారు.

ఈ మాస్కూలు యువీ క్రిమిరహితం, అలాగే 99.95% బ్యాక్టీరియాని నిరోదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. తయారీ ప్రక్రియ సంబంధించి ఒక వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

స్టార్ట్-అప్ కంపెనీ వ్యవస్థాపకుడు సుహాని మోహన్ కూడా ఈ విజయాన్ని సాధించడానికి మహీంద్రా ఎలా సహాయపడిందనే దానిపై తన ఆలోచనలను పంచుకున్నారు.

ఆనంద్ మహీంద్రాకు తన మొదటి ఇమెయిల్ నుండి 8 రోజుల్లో 3-ప్లై మాస్క్‌ల ఉత్పత్తిని ప్రారంభించడానికి ఎంతో సహకరించినందుకు మొత్తం మహీంద్రా ఆటోమోటివ్ బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

click me!