Budget 2020: బడ్జెట్ ఎఫెక్ట్: ఏ వస్తువులపై ధరలు పెరగనున్నాయి...

By Sandra Ashok KumarFirst Published Feb 1, 2020, 6:33 PM IST
Highlights

నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ నేడు ప్రవేశపెట్టారు. ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. బడ్జెట్ లో ఉద్యోగులకు ట్యాక్స్ విషయంలో  మినహాయింపులు కల్పించి శుభవార్త చెప్పారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ నేడు ప్రవేశపెట్టారు. ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. బడ్జెట్ లో ఉద్యోగులకు ట్యాక్స్ విషయంలో  మినహాయింపులు కల్పించి శుభవార్త చెప్పారు. అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడం కోసం దేశీయ ఉత్పత్తి రంగానికి కొన్ని ప్రోత్సాహకాలు అందించారు.

దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం కోసం విదేశీ దిగుమతులపై కొంత కఠిన వైఖరి కనబరిచినట్లు ఆమె సుదీర్ఘ ప్రసంగంలో తెలుస్తోంది. దీంతో రోజువారీ వస్తువుల ధరలపై బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరి మనసులో మెదులయ్యాయి. మరి ఈ సారి బడ్జెట్‌ ఏయే వస్తువుల ధరలు అందుబాటులోకి రానున్నాయి? ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి? ఒక్కసారి వాటిని చూద్దాం.

also read  "బేటి బచావో, బేటి పాడావో" కు అద్భుతమైన ఫలితాలు": నిర్మలా సీతారామన్
 
ధరలు పెరిగేవి వస్తువులు

చెప్పులు, షూస్ తదితరాలు
 సీట్లు, మంచాలు, దుప్పట్లు, ల్యాంప్స్, లైటింగ్ తదితరాలు
 టేబుల్‌వేర్, కిచెన్‌వేర్, గ్లాస్‌వేర్, చీపుర్లు, దువ్వెనలు తదితరాలు
 ఫాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, ట్రిమ్మర్స్, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రయ్యర్లు, ఓవెన్స్, కుక్కర్లు, కాఫీ/టీ మేకర్స్, ఇస్త్రీపెట్టెలు తదితరాలు
 ఫైలింగ్ కేబినెట్లు, పేపర్ ట్రేలు, బైండర్స్, క్లిప్పులు, పిన్నులు, సైన్‌ప్లేట్లు, నేమ్‌ప్లేట్లు తదితరాలు
విదేశీ మెడికల్ పరికరాలు
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు
ఎలక్ట్రిక్ వెహికిల్స్ మినహా కమర్షియల్ వాహనాల స్పేర్ పార్ట్స్
చిన్నపిల్లల బొమ్మలు, సైకిళ్లు తదితరాలు
కొన్ని ఆల్కహాలిక్ డ్రింకులు
మొబైల్ ఫోన్లు
దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలు

also read లక్స్, లైఫ్‌బాయ్‌తో పాటు పెరిగిన సబ్బుల ధరలు

ధరలు తగ్గుబోయే వస్తువులు

 కాగితం, న్యూస్‌ప్రింట్
స్పోర్ట్స్‌కు సంబంధించిన వస్తువులు
ప్యూరిఫైడ్ టెరిప్తాలిక్ యాసిడ్‌
పంచదార
వ్యవసాయ, పాడి ఉత్పత్తులు
పాలు
సోయా ఫైబర్
సోయా ప్రొటీన్

click me!