LIC Share Target: ఎల్ఐసీ షేర్లలో కదలిక, మోతీలాల్ ఓస్వాల్ టార్గెట్ రూ.830, ఊపిరి పీల్చుకుంటున్న ఇన్వెస్టర్లు..

By Krishna AdithyaFirst Published Jul 5, 2022, 5:39 PM IST
Highlights

లిస్టింగ్ సమయంలో నుంచి ఇన్వెస్టర్లకు పీడకల మిగిల్చిన LIC షేర్లలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. దీంతో బ్రోకరేజీలు ఈ షేర్లలో బయ్ సలహా ఇస్తున్నారు. అంతేకాదు టార్గెట్ ధర కూడా రూ.830గా నిర్ణయించారు.

ఐపీవో లిస్టింగ్ నుంచే నష్టాలను మూటగట్టుకున్న ఎల్ఐసీ ఎట్టకేలకు రికవరీ బాట పట్టింది.  ఆల్ టైం కనిష్ట స్థాయి రూ. 654 వద్ద జూన్ 17న నమోదవగా, అక్కడి నుంచి ఈ స్టాక్ నెమ్మదిగా పైకి మూవ్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 701 వద్ద ట్రేడవుతోంది. 

 బీమా రంగంలో అతి పెద్ద కంపనీగా ఉన్న ఎల్‌ఐసి నెమ్మదిగా కోలుకుంటోంది. గడిచిన రెండు వారాలుగా స్టాక్ ధరలో మూవ్ మెంట్ కనిపిస్తోంది. దీంతో ఐపీవో అలాట్ మెంట్ ద్వారా షేర్లు పొందిన వారికి కాస్త ఊరట లభిస్తోంది. గత వారం రోజులుగా ఇతర బీమా కంపెనీలతో పోల్చి చూస్తే ఎల్ఐసీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఎల్‌ఐసీపై ప్రజలకు ఏళ్ల తరబడి ఉన్న నమ్మకమే ఇందుకు ప్రధాన కారణం. 

ఎంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చినా కూడా LIC ఈ రంగంలో ఇప్పటికీ మార్కెట్ లీడర్ గానే ఉంది.  అయితే, ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించినప్పటి, సమయం బాగా లేదు. దీంతో ఎల్ఐసీ లిస్టింగ్ అప్పటి నుంచే పతనం అవుతూనే ఉంది. ఒక దశలో 654 రూపాయల కనిష్ట స్థాయిని తాకింది. అయితే ప్రస్తుతం శుభవార్త ఏమిటంటే, ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ఎల్‌ఐసి స్టాక్‌ పై బుల్లిష్ గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ దీనికి 'BUY' రేటింగ్ ఇవ్వడం విశేషం. దీంతో మదుపరులకు ఈ స్టాక్ పై ఒక్క సారిగా విశ్వాసం పెరిగింది. 

ఎల్‌ఐసీ టార్గెట్ రూ.830 
బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్‌కు ఎల్‌ఐసి స్టాక్‌పై బుల్లిష్ గా ఉంది. ఎల్ఐసీని రూ. 830 టార్గెట్ ధరతో ప్రస్తుత లెవెల్ వద్ద కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీనికి మార్కెట్లో ఎల్ఐసీకి ఉన్న స్థానమే కారణం అని చెబుతోంది. మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ LIC స్టాక్ దాదాపు 10% CAGRని అందజేస్తుందని అంచనా వేసింది. అలాగే కొత్త వ్యాపారాల  మార్జిన్ కూడా 13.6%తో మెరుగుపడవచ్చని అంచనా వేసింది. 

మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ తన నోట్స్‌లో ఇలా రాసుకొచ్చింది. LIC యాన్యుటీ విభాగంలో మంచి వృద్ధి కనబరచింది. దీని వల్ల సంస్థ ప్రయోజనం పొందుతుంది. అయితే ప్రైవేట్‌ సంస్థలు కూడా ఈ విభాగంలో తమ వాటాను పెంచుకుంటున్నాయని సూచించింది. 

నిజానికి లిస్టింగ్ నుండి, LIC షేర్లు పూర్తి తిరోగమనంలో ఉన్నాయి. దీంతో లిస్టింగ్ సమయంలో షేర్లు అలాట్ అయిన మదుపరులు నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్ ఇచ్చిన రేటింగ్ కొత్త ఆశలు చిగురించేలా చేసింది.  ప్రస్తుతం కంపెనీ షేరు ధర 34% దిగువన ట్రేడవుతోంది. అయితే మంచి విషయమేమిటంటే గత ఐదు రోజుల్లో బీఎస్ఈలో ఈ షేరు రూ.659 నుంచి రూ.707.20కి పెరిగింది. అంటే, ఈ కాలంలో 7.03% జంప్ కనిపించింది. 

(Disclaimer: స్టాక్ పెట్టుబడి సలహా బ్రోకరేజ్ హౌస్ అందించిన సమాచారం మేరకు పేర్కొనడం జరిగింది. ఇవి ఏషియానెట్ తెలుగు వెబ్ సైట్ యొక్క అభిప్రాయాలు కాదు. మార్కెట్‌ లో పెట్టుబడులు రిస్క్ తో కూడినవి, కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోండి.)

click me!