Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ చేస్తున్న వ్యాపారం ఏంటో తెలిస్తే మతి పోవాల్సిందే ? ఆమె ఆస్తుల విలువ ఎంతంటే?

By Krishna Adithya  |  First Published Jun 28, 2023, 3:23 PM IST

టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ ఆస్తుల విలువ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆమె ఏమేం వ్యాపారాలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా..అయితే ఇక్కడ ఆమె సంపాదనకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఓ లుక్ వేయండి.


టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమె గత రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించారు అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్నటువంటి, అందరూ టాప్ హీరోలతో ఆమె జతకట్టి నటించారు. ఈ నేపథ్యంలో అమ్మడు సంపాదించినటువంటి ఆస్తులు అలాగే ప్రస్తుతం ఏటా ఎంత వెనకేసుకుంటున్నారో ఆమె ఆదాయం ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం. 

37  ఏళ్లు దాటిన కాజల్ అగర్వాల్ 2004లోనే బాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు. ఆమె హీరోయిన్ పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ గా కనిపించారు. ఆ తర్వాత 2008లో తమిళ్ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.  అదే సంవత్సరం ఆమె లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో సైతం అడుగు పెట్టారు.  కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా ఆమెకు  మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.  ఆ తర్వాత రామ్ చరణ్ సరసన మగధీరలో కాజల్ అగర్వాల్ మెరిసింది. ఈ సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలబెట్టింది.  ఆ తరువాత కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోలు అందరితోనూ నటించింది.  ప్రభాస్,  మహేష్ బాబు,  అల్లు అర్జున్,  రామ్ చరణ్ తేజ,  చిరంజీవి,  ఇలా తెలుగులోని సూపర్ స్టార్లు అందరితోనూ ఆమె ఆడి పాడింది.  అలాగే తమిళ్ ఇండస్ట్రీలో కూడా కాజల్ అగర్వాల్   అగ్ర నటులు అందరితోనూ  జతకట్టింది. 

Latest Videos

ఇక కాజల్ అగర్వాల్ ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే ఆమె నికర ఆదాయం మొత్తం సుమారు 85 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె సంవత్సరానికి 6 కోట్లు సంపాదిస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే ఆమె ప్రతినెల 50 లక్షల రూపాయల పైనే ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ఆమె ఒక్కో బ్రాండ్ వద్ద నుంచి ఒక పోటీ నుంచి రెండు కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బ్యూటీ సోప్ అయినటువంటి లక్స్, అలాగే రిటైల్ జ్యువెలరీ స్టోర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, శ్రీ లక్ష్మీ జువెలరీ, ఏవిఆర్ జ్యువెలరీ వంటి బ్రాండ్లకు సైతం ఆమె మోడల్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మొబైల్ బ్రాంచ్ సామ్ సంగ్ సైతం కాజల్ అగర్వాల్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. అలాగే గతంలో కాజల్ అగర్వాల్ డాబర్ ఆమ్లా బ్రాండ్ కు అంబాసిడర్ గా పనిచేశారు.

ఇక కాజల్ అగర్వాల్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే, ఆమె తన సోదరితో కలిసి ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ను స్థాపించినట్లు తెలుస్తోంది. అలాగే ఆమె ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు 10 కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కాజల్ అగర్వాల్ ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్లు వసూలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సినిమాల కన్నా కూడా బ్రాండ్ ప్రమోషన్ల మీదనే ఎక్కువ ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది.
 

click me!