Gold rate: హైదరాబాద్‌లో 3 నెలల కనిష్టానికి బంగారం ధ‌ర‌లు..

By Mahesh Rajamoni  |  First Published Jun 28, 2023, 2:22 PM IST

Gold Price: దేశ రాజధాని ఢిల్లీలో నేడు (జూన్ 28న) బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 గా ఉంది. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల పది గ్రాముల ధర ఎలాంటి మార్పులు లేకుండా రూ.59,430గా కొనసాగుతోంది. రాజధాని నగరంలో వెండి ధర రూ. కిలోకు 71,500 గా ఉంది. 
 


Gold rate in Hyderabad: హైదరాబాద్‌లో బంగారం ధరలు నేడు (జూన్ 28న) మూడు నెలల కనిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.54,050 కు చేరుకోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధర రూ.58,960కు త‌గ్గింది. US డాలర్‌లో పెరుగుదల, US ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపుకు సంబంధించిన ఊహాగానాలు బంగారం ధరలలో తగ్గుదలకు కారణమని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. US డాలర్ పెట్టుబడిదారులకు ప్రాధాన్య ఆస్తిగా మిగిలిపోయినందున, బంగారం ధరలు గణనీయమైన సవరణలను చూశాయి. ధ‌ర‌ల హెచ్చుత‌గ్గుల ఫలితంగా బంగారం ధరలు గత మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

మే 28న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 గా ఉంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 59,450గా ఉంది. డిసెంబర్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. డిసెంబరు 28, 2022 నాటి ధరలతో పోల్చినప్పుడు, ఇటీవలి తగ్గుదలతో కూడా, ప్రస్తుత బంగారం ధరలు ఇప్పటికీ ఆరు శాతం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని దేశాల్లో మాంద్యం, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి అనేక కారణాల వల్ల హైదరాబాద్ సహా ఇతర భారతీయ నగరాల్లో బంగారం ధరల భవిష్యత్తు దిశ అనిశ్చితంగానే ఉంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతాయా లేక మళ్లీ పెరుగుతాయా అనేది చూడాలి.

Latest Videos

ఇదిలావుండ‌గా, దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 గా ఉంది. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల పది గ్రాముల ధర ఎలాంటి మార్పులు లేకుండా రూ.59,430గా కొనసాగుతోంది. రాజధాని నగరంలో వెండి ధర రూ. కిలోకు 71,500 గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో గత రెండు నెలలుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులను ఎదుర్కొన్నాయి. దాదాపు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర దాదాపు రూ.60 వేల వ‌ర‌కు ఉండ‌గా, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  ధ‌ర 55,000గా కొన‌సాగింది.

click me!